అధికారులను పరుగులు పెట్టిస్తున్న బాబు

భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యముగా విజయవాడ నగరాన్ని భారీ వరదలు ముచ్చేసాయి. నగరంలో ఎటు చుసిన నీరే కనిపిస్తుంది. రెండు రోజులుగా అనేక కాలనీ లు నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటీకే ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. సీఎం చంద్రబాబు సైతం నిద్రాహారాలు లేకుండా రాత్రింబవళ్లు వరద ప్రభావిత ప్రాంతాల్లోనే పర్యటిస్తూ వస్తున్నారు. ఆదివారం అంతా విజయవాడలోని (Vijayawada) పలు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం.. తెల్లారుజామున రెండు గంటలు మాత్రమే నిద్రపోయారు. మళ్లీ యథావిధిగా రంగంలోకి దిగిన ఆయన వరద సహాయక చర్యలు దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఓ వైపు ఎన్డీఆర్ఎఫ్, మరోవైపు పవర్ బోట్స్ రావడంతో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. సోమవారం ఉదయం నుంచి కూడా అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు.

విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు జేసీబీ ఎక్కి పర్యటించారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం, రామలింగేశ్వరనగర్, జక్కంపూడిలో ఇతర వాహనాలు వెళ్లలేని పరిస్థితిలో… చంద్రబాబు జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.