మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ ఆయన కుమార్తెలు బబితా ఫోగట్, గీతా ఫోగట్‌ల జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘దంగల్’ ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించిన సంగతి అందరికీ తెలిసిందే బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ అంటూ పేరుగాంచిన ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా విడుదలైన తరువాత పలు రికార్డులను తిరగరాసింది ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఏకంగా రూ. 2,000 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం జరిగింది
తాజాగా ఈ సినిమాలో ప్రేరణగా నిలిచిన బబితా ఫోగట్ సినీ ప్రపంచం నుండి తమ కుటుంబానికి వచ్చిన ఆర్థిక లాభాల గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు రెజ్లింగ్‌లో రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించిన బబితా ఇటీవల ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘దంగల్’ సినిమా ద్వారా తమ కుటుంబానికి వచ్చిన ఆర్థిక విషయాలను పబ్లిక్‌గా షేర్ చేశారు.
బబితా ఫోగట్ తన ఇంటర్వ్యూలో “దంగల్” సినిమా ద్వారా వచ్చిన రూ. 2,000 కోట్లలో తమ ఫోగట్ కుటుంబానికి కేవలం రూ. 1 కోటి మాత్రమే అందిందని వెల్లడించారు “మా కుటుంబం ఈ సినిమాతో ఎక్కువ డబ్బు ఆశించలేదు మా తండ్రి ఎప్పుడూ డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వలేదు ప్రజల ప్రేమ గౌరవమే ముఖ్యం అని ఆయన నమ్ముతారు” అని బబితా చెప్పారు ఆమె ఈ సందర్భంగా ఒక ఆసక్తికర విషయం కూడా పంచుకున్నారు “మా తండ్రి ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించరు ప్రజల గౌరవం ప్రేమ మాకు చాలా విలువైనవి దంగల్ సినిమా ద్వారా మా కుటుంబం ఆ గౌరవాన్ని సంపాదించింది” అని పేర్కొన్నారు.
2016లో విడుదలైన “దంగల్” చిత్రం మహావీర్ సింగ్ ఫోగట్ తన కుమార్తెలను ఎలైట్ రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దారో ఆ తర్వాత వారు భారతదేశానికి పతకాలు ఎలా సాధించారో చూపిస్తుంది గీతా ఫోగట్ బబితా ఫోగట్‌లు దేశం కోసం పోటీపడి అనేక పతకాలు గెలుచుకుని తమ తండ్రి ఆశయాన్ని నెరవేర్చారు బబితా ఫోగట్ తన కుస్తీ కెరీర్‌లో అనేక విజయాలను సొంతం చేసుకున్నారు 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. 2012 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించారు 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాన్ని గెలుచుకుని భారతదేశానికి గొప్ప గౌరవం తెచ్చిపెట్టారు 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొన్నప్పటికీ పతకం గెలవలేకపోయారు.
2019లో బబితా ఫోగట్ కుస్తీ పోటీలకు గుడ్‌బై చెబుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆమె భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు ఆమెకు క్రీడా ప్రపంచంలోనే కాకుండా రాజకీయాల్లో కూడా మంచి గుర్తింపు ఉంది.