వేసవి తాపం ఎక్కువ సమయంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే కొన్ని కూరగాయలు వేసవిలో తినడం వల్ల శరీరానికి హానికరంగా మారవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నివేదిక ప్రకారం, వంకాయ, ఉల్లిపాయ, బీట్రూట్, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వేసవిలో దూరంగా ఉండాలని సూచించింది. ఇవి శరీరంలో వేడిని పెంచి డీహైడ్రేషన్‌కు దారితీసే ప్రమాదం ఉంటుంది.
వంకాయ అస్సలు తినకండి
వంకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది చర్మ సమస్యలు, రాషెస్‌కు కారణమవుతుంది. ఉల్లిపాయ వంటలో వేడి చేసేప్పుడు ఎసిడిటీకి దారితీస్తుంది. బీట్రూట్ కూడా అధిక వేడి కలిగించి బాడీ గడ్డలను ఏర్పరచే అవకాశం ఉంటుంది. కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి కూరగాయలు శరీరంలోని నీటిని తక్కువ చేస్తూ డీహైడ్రేషన్‌కు కారణమవుతాయి.

తేమ ఎక్కువగా కలిగిన కూరగాయలు
వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేందుకు తేమ ఎక్కువగా కలిగిన కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. ముఖ్యంగా కీర, సొరకాయ, తులసి, పుదీనా వంటి కూరగాయలు వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఆకుకూరలు శరీరానికి తేమను అందించడంతో పాటు విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్యాన్ని కాపాడతాయి. వేసవిలో సరైన ఆహార నియమాలు పాటించడం ద్వారా శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.