avanthi srinivas resigns ycp

జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక నాయకులు వీడడం మరింత షాక్ కు గురి చేస్తుంది. ఇటీవల మగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా జెడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రాజీనామాలు మాత్రం ఆగడం లేదు.

Advertisements

తాజాగా, వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసారు. పార్టీ కార్యకలాపాలకు ఆయన గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు.ఇక ఇప్పుడు తన అనుచరులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆవంతి రాజీనామా వైసీపీకి గట్టి దెబ్బగా మారనుంది. అవంతి వంటి కీలక నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఎన్నికల ముందు పార్టీ క్రమశిక్షణలో మార్పులు తేవాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, నాయకత్వంలో ఉన్న విభేదాలు ఇంకా పరిష్కరించలేకపోయారు. అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అవంతి నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేతగా ఉన్నందున, ఆయన నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది.

Related Posts
WhatsApp : తప్పుడు ఖాతాల గుర్తింపు : లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్
WhatsApp తప్పుడు ఖాతాల గుర్తింపు లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్

WhatsApp : తప్పుడు ఖాతాల గుర్తింపు : లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి Read more

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం: ట్రంప్
జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ట్రంప్

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు Read more

ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు
ఏపీలో మరో రెండు బీసీ గురుకులాలు

ఏపీలో ప్రస్తుతం 107 బీసీ గురుకులాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు కొత్త గురుకులాలను ప్రారంభించనుంది. ఈ గురుకులాలు Read more

టెక్నాలజీ వాడకంలో ఏపీ నెం 1 – నారా లోకేశ్
lokesh davos

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం టెక్నాలజీ వినియోగంలో నంబర్ వన్ స్థానంలో ఉందని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మాట్లాడిన Read more

×