avanthi srinivas resigns ycp

జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక నాయకులు వీడడం మరింత షాక్ కు గురి చేస్తుంది. ఇటీవల మగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా జెడ్పీ ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్లు వంటి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నప్పటికీ, రాజీనామాలు మాత్రం ఆగడం లేదు.

తాజాగా, వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసారు. పార్టీ కార్యకలాపాలకు ఆయన గత కొంత కాలంగా దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు.ఇక ఇప్పుడు తన అనుచరులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆవంతి రాజీనామా వైసీపీకి గట్టి దెబ్బగా మారనుంది. అవంతి వంటి కీలక నేతలు పార్టీని వీడడం వల్ల పార్టీ భవిష్యత్తు మరింత సంక్షోభంలో పడే అవకాశం ఉంది. ఎన్నికల ముందు పార్టీ క్రమశిక్షణలో మార్పులు తేవాలని జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా, నాయకత్వంలో ఉన్న విభేదాలు ఇంకా పరిష్కరించలేకపోయారు. అవంతి శ్రీనివాస్ ఏ పార్టీలో చేరుతారనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అవంతి నియోజకవర్గంలో బలమైన రాజకీయ నేతగా ఉన్నందున, ఆయన నిర్ణయం స్థానిక రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది.

Related Posts
నేడు శీతాకాల విడిదికి రాష్ట్రపతి రాక
Today the President will come to Hyderabad for winter vacation

హైదరాబాద్‌: శీతాకాల విడిది కోసం నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ రాష్ట్రపతి ముర్ము Read more

బోరుబావిలో పడ్డ బాలుడు మృతి
Five year old Aryan

రాజస్థాన్ , డిసెంబర్ 12,బోరుబావిలో పడ్డ బాలుడిని కాపాడేందుకు రెండు రోజులుగా అధికారులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. విషాదకర సంఘటనగా మిగిలిపోయిన బాలుడి ఉదంతం రాజస్థాన్ Read more

ప్రోస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం : బైక్ ర్యాలీని నిర్వహించిన అపోలో క్యాన్సర్ సెంటర్
Prostate Cancer Awareness P

హైదరాబాద్ : అపోలో క్యాన్సర్ సెంటర్ (ACC) హైదరాబాద్, ది బైకెర్నీ క్లబ్‌తో కలిసి, ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పురుషుల క్యాన్సర్ మాసం సందర్భంగా Read more

కొత్త ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన వైష్ణోయ్ గ్రూప్..
Vaishnoi Group launched a new landmark project

రియల్ ఎస్టేట్ లో దూరదృష్టి కలిగిన వ్యక్తి, దాత అయిన వైష్ణోయ్ గ్రూప్ వ్యవస్థాపకుడు యెలిశాల రవి ప్రసాద్ తెలంగాణా రియల్ ఎస్టేట్ రంగ తీరుతెన్నులను మార్చడానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *