tdp mla kolikapudi

గిరిజన మహిళపై దాడి.. టీడీపీకి కొలికపూడి వివరణ

తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఇవాళ పార్టీ పెద్దల ముందు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. దీనిపై విచారించి కొలికపూడిపై తదుపరి చర్యల్ని అధిష్టానం ఖరారు చేయబోతోంది. తిరువూరు నియోజకవర్గంలోని ఎ. కొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి ఈ నెల 11న వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. ఆయన సోదరుడు అయిన వైసీపీ నేత భూక్యా కృష్ణకు చెందిన భూ వివాదంపై హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కృష్ణ భార్యను సైతం ఇంట్లో దూరి కొట్టి అవమానించారని ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై టీడీపీ హైకమాండ్ కొలికపూడి వివరణ కోరింది. ఈ వ్యవహారంపై ఇవాళ టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొలికపూడి.. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరని, వాస్తవం వేరని తెలిపారు.

Related Posts
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
pawan manyam

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని తన రాజకీయ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని హర్షించారు. 2018లో Read more

రాజ్యసభకు కుటమి అభ్యర్దుల నామినేషన్
rajyasabha

రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేస్తున్న టీడీపీ అభ్యర్థులు సానా సతీష్, బీదా మస్తాన్రావు, బిజెపి అభ్యర్థి ఆర్. కృష్ణయ్య మూడు రాజ్యసభ ఎంపి సీట్లకు ముగ్గురు అభ్యర్థులు Read more

బద్వేల్ ఘటన.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
Shocked by girls death in

బద్వేల్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంటర్ విద్యార్థిని పై విఘ్నేశ్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి అంటించగా..బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ Read more

ప్రభల తీర్దానికి అరుదైన గుర్తింపు
prabhala tirdam

సంక్రాంతి పండుగ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ పండుగ ఉత్సవాల్లో కోనసీమ ప్రభల తీర్దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. అంబాజీపేట మండలం మొసలపల్లి గ్రామంలోని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *