Attack on Congress leader F

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌హ‌దారి ప‌నులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడు గుంత‌లో పడడంతో తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో ర‌హ‌దారిపై గుంత‌లు, త‌న‌కు త‌గిలిన గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు తెలిపాడు. దీంతో ఫిరోజ్ ఖాన్ ర‌హ‌దారి ప‌నులను ప‌రిశీలించేందుకు వెళ్లాడు. విష‌యం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయ‌న వ‌ర్గీయుల్లో ఆగ్రహం క‌ట్ట‌లు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌ర‌స్ప‌రం రాళ్ల దాడి జ‌రిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు.

ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. చివరి వరకు తన గెలుపు ఖాయమంటూ ఫిరోజ్ ధీమాగా ఉన్నారు. కానీ చివరికి స్థానిక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయాన్ని అందుకున్నారు. అది కూడా కేవలం 1500 ఓట్లతో ఫిరోజ్ ఖాన్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

Related Posts
తెలంగాణలో నేరాలు 22.5% సైబర్ నేరాలు 43% పెరిగాయి
తెలంగాణలో నేరాలు 22.5 సైబర్ నేరాలు 43 పెరిగాయి

తెలంగాణలో 2024లో నేరాల రేటు గణనీయంగా పెరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ జితేందర్ వెల్లడించారు. 2023లో 1,38,312 కేసుల నుంచి 2024లో నేరాల Read more

పవిత్రతో రిలేషన్ షిప్ పై నరేష్ ఆసక్తికర కామెంట్స్
naresh pavitra

సీనియర్ నటుడు నరేష్ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటి పవిత్ర రావు తన జీవితంలోకి వచ్చాక, తన జీవితం కాస్త మెరుగుపడిందని Read more

శ్రీతేజ్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులిటెన్ విడుదల
Allu Arjun Sri Tej

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన సంగతి తెలసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా డిసెంబర్ 4న రాత్రి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో Read more

పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం
పుష్ప 2 తొక్కిసలాట: మానవ హక్కుల జోక్యం

తెలంగాణ హైకోర్టులో రామారావు ఇమ్మనేని అనే న్యాయవాది దాఖలు చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) పుష్ప 2: సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట కేసు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *