Atrocious incident in Tamil Nadu..A student was raped by a gang of teachers

తమిళనాడులో దారుణ ఘటన..విద్యార్థినిపై టీచర్ల గ్యాంగ్‌ రేప్‌

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారారు. ఓ విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలోని ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థినిపై ముగ్గురు గురువులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పుకోలేని అసహాయతలో ఉన్న బాలిక తల్లి.. ఆమెను నెలరోజుల పాటు స్కూలుకు సెలవు పెట్టించి అబార్షన్‌ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దారుణ ఘటన వెలుగు చూసింది.

Advertisements
image

బాలిక తల్లి చెప్పింది విని ఆగ్రహించిన ఆ హెడ్మాస్టర్‌.. వెంటనే శిశు సంక్షేమ అధికారులకు ఆమెతో ఫిర్యాదు చేయించారు. పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులు, ఒక డిగ్రీ టీచర్‌ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. దీంతో శిశు సంక్షేమ సంరక్షణ అధికారులు బర్గూర్‌ మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికపై దారుణానికి ఒడిగట్టిన ఉపాధ్యాయులు చిన్నసామి(57), ఆర్ముగం(45), ప్రకాశ్‌(37)ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారి తీసింది.

సీఎం స్టాలిన్‌కు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు నిరసన ప్రదర్శన చేశాయి. బాలికను కృష్ణగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమిళనాట వరుసగా అత్యాచార ఘటనలు స్టాలిన్‌ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబరు 23న ప్రఖ్యాత అన్నామలై విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థినిపై ఇద్దరు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Related Posts
చైనా ఖాతాలో మరో రికార్డు
చైనా ఖాతాలో మరో రికార్డు

భూగర్భ పరిశోధనలో చైనా మరో మైలురాయిని సాధించింది. భూమి అంతరాళాన్ని అధ్యయనం చేయడానికి చైనా 10.9 కిలోమీటర్ల లోతైన బోరు బావిని తవ్వి ఆసియాలోనే అత్యంత లోతైన Read more

విజయవంతంగా వందే భారత్‌ ట్రయల్‌ రన్‌
vande bharath new sleeper train

భారతీయ రైల్వేస్ లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా Read more

మదర్సాలపై మాధవీ లత సంచలన వ్యాఖ్యలు
madrasas

బీజేపీ నేత కొంపెల్ల మాధవీలత, ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌లో మాట్లాడుతూ దేశానికి అతివృష్టి, అనావృష్టి రెండూ ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఫెడరలిజం వల్ల అన్ని మతాలు, పండుగలు, Read more

KTR vs Surekha : పరువు నష్టం కేసు విచారణ వాయిదా
KTRs defamation suit against Konda Surekha. Hearing in court today

మంత్రి కొండా సురేఖపై పెట్టిన పరువునష్టం దావాపై కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణను నవంబర్ 13కు వాయిదా వేయడం జరిగింది. నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో Read more

×