నైజీరియాలో ఘోర ప్రమాదం.. 48 మంది మృతి

నైజీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 48 మంది మరణించినట్లు ఆ దేశ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపింది. మరో 50 వరకు పశువులు మృతి చెందాయి. ఈ విషయాన్ని ఆ దేశ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.

నైజీరియాలో నార్త్- మధ్య నైజర్ రాష్ట్రంలోని ఆగాయి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలు చుట్టుపక్కన వాహనా లకు అట్టుకున్నాయి. ట్రక్కులో ఉన్న 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మొదట్లో 30 మంది సజీవ దహనమయ్యారు. మరో 18 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి.

మృతులకు సమీపంలోని ఓ ప్రాంతంలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొంది. నైజీరియాలో సరైన రైల్వే వ్యవస్థ లేదు. ముఖ్యంగా కార్గో రవాణాకు కేవలం వాహనాలు మాత్రమే వినియోగిస్తున్నారు. ఆఫ్రికాలో అత్యధిక జనాబా కలిగిన నైజీరియాలో ఆ తరహా ప్రమాదాలు సాధారణంగా చెబుతున్నారు. 2020లో 1,531 ప్రమాదాలు జరగగా 535 మంది మరణించారు.