Assembly elections.. 46.55 percent polling till 3 pm

అసెంబ్లీ ఎన్నికలు.. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం పోలింగ్‌..

న్యూఢిల్లీ : ఢిల్లీలో శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటలకు ఓటింగ్‌ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 46.55 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి భవితవ్యాన్ని తేల్చేందుకు మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 13,766 పోలింగ్‌ కేంద్రాలలో ప్రజలు ఓట్లు వేస్తున్నారు. హోమ్‌ ఓటింగ్‌ సౌకర్యం ద్వారా అర్హత కలిగిన 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈనెల 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

image

ఇక, తమిళనాడులోని ఈరోడ్‌(ఈస్ట్‌), ఉత్తర్‌ప్రదేశ్‌లోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో 53.63 శాతం, 57.13 శాతం పోలింగ్ నమోదైంది. ఈరోడ్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌ మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయోధ్య జిల్లాలోని మిల్కిపుర్‌లో ఉప ఎన్నికను సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

Related Posts
అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్
sridarbabu

సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి తన వైఖరిని స్పష్టంచేశారు. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, Read more

నేడు ఏపీలో పింఛన్ల పంపిణీ
Distribution of pensions in

రేపు (ఆదివారం) సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు పంపిణీ చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్లు ప్రతి Read more

గేమ్ ఛేంజర్: 4 పాటలకు 75 కోట్లు!
గేమ్ ఛేంజర్: 4 పాటలకు 75 కోట్లు!

రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలోని నాలుగు పాటలను చిత్రీకరించడానికి దర్శకుడు శంకర్ ₹75 కోట్లు ఖర్చు చేసినట్లు Read more

బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
actor govind

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *