Ashok Leyland plant to be inaugurated in AP today

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం

AP Govt: నేడు ఏపీలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం కానుంది. మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ఈరోజు సాయంత్రం 5గంటలకు మంత్రి లోకేష్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అశోక్ లేలాండ్ చైర్మన్ ధీరజ్ హిందూజా, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. భారీ పెట్టుబడులతో మల్లవల్లిలో బస్సు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ ప్లాంట్ ప్రారంభంతో రాష్ట్రానికి మరో కీలక పరిశ్రమ రానుంది. ప్లాంట్ ద్వారా ఏపీలో ఆటోమొబైల్ రంగానికి జోష్ రానుంది. మల్లవల్లి యూనిట్ నుంచి దేశవ్యాప్తంగా బస్సుల సరఫరా ఉంటుంది.

Advertisements
నేడు ఏపీలో అశోక్ లేలాండ్

1200 మందికి ఉద్యోగాలు

పరిశ్రమల విస్తరణలో మరో మెట్టుపై ఏపీ నిలువనుంది. తొలివిడతలో 600మందికి, మలివిడతలో 1200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. కాగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌లో అశోక్‌ లేల్యాండ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో ఆ సంస్థ ఎలక్ర్టికల్‌ బస్‌ బాడీ బిల్టింగ్‌ ప్లాంట్‌ నెలకొల్పింది. దీనిని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసేలోపు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం అశోక్‌ లేల్యాండ్‌కు తగిన సహకారం ఇవ్వలేదు.

మొట్టమొదటి ఆటోమొబైల్‌ ప్లాంటు ఇది

కొవిడ్‌ అనంతర పరిస్థితులు కూడా ప్లాంట్‌ కార్యకలాపాలకు ఆటంకంగా మారాయి. కూటమి ప్రభు త్వం వచ్చాక అశోక్‌ లేల్యాండ్‌ సంస్థ ప్లాంట్‌ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఎలక్ర్టికల్‌ బస్సులే కాకుండా అన్ని రకాల బస్సులకు బాడీ బిల్డింగ్‌ చేసే దిశగా ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి ఆటోమొబైల్‌ ప్లాంటు ఇది. ఈ ప్లాంట్‌లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు బీఎస్‌- 6 మోడళ్ల బస్సులను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు ఫేజ్‌-1, 2లలో సంవత్సరానికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది.

Related Posts
HCU : స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?
smitha

తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో IAS అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. దీనిపై Read more

బీజేపీలో చేరిన ఆప్‌ నేత కైలాశ్‌ గెహ్లాట్‌
AAP leader Kailash Gahlot joined BJP

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ మంత్రి, సీనియర్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కైలాష్ గెహ్లాట్‌ బీజేపీలో చేరారు. ఢిల్లీ రవాణా శాఖ మంత్రిగా పనిచేసిన గహ్లోత్‌ Read more

ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేసాడు – జగన్
jagan babu 1

జగన్ మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. నేడు విజయనగరం జిల్లాలో డయేరియా తో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల Read more

Career Growth : 35 ఏళ్ల తర్వాత సంతానం కష్టమే!
Men's sperm

నేటి సమాజంలో కెరీర్ అభివృద్ధి కోసం చాలా మంది పురుషులు పెళ్లిని వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటినా ఇంకా స్థిరమైన జీవితం కోసం ఎదురుచూస్తూ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×