Arvind Kumar, BLN Reddy, who have appeared for ACB and ED investigation

విచారణకు హాజరైన అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్ కావటం ఖాయమని అధికార కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఏసీబీ, ఈడీ విచారణకు హాజరయ్యారు.

image
image

హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ఏసీబీ కార్యాలయంలో అరవింద్ కుమార్ విచారణకు హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన MA & UD శాఖలో స్పెషల్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు అగ్రిమెంట్ సమయంలో అరవింద్ కుమార్ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే రూ.55 కోట్ల అక్రమ నగదు లావాదేవీలపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ రికార్డ్ చేసేందుకు విచారణకు పిలిచారు.

ఇదే కేసులో మనీ లాండరింగ్, ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ఈడీ అధికారులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ-రేసు 2 అగ్రిమెంట్ సమయంలో డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయటంతో బీఎల్‌ఎన్ రెడ్డి కీ రోల్ ప్లే చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విదేశాలకు నిధులు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు ఆర్‌బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదనే అంశాలపై ఈడీ బీఎల్‌ఎన్ రెడ్డి ప్రశ్నించనున్నట్లు సమాచారం.

Related Posts
రేపు జగన్ ప్రెస్ మీట్
నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో Read more

ఎమ్మెల్యే కొలికపూడిని సస్పెండ్ చేయాలంటూ రోడ్డెక్కిన మహిళలు
tiruvuru women protest agai

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును టీడీపీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చిట్టేల గ్రామంలో సోమవారం మహిళలు రోడ్లపై నిరసనకు దిగారు. అనూహ్యంగా ఎమ్మెల్యే Read more

క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!
క్రికెట్లో భారత మహిళ అరుదైన రికార్డు!

కేవలం 95 ఇన్నింగ్స్‌లలో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్న స్మృతి మంధాన, వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు సాధించిన భారత మహిళగా నిలిచింది. మిథాలీ రాజ్ Read more

‘కేర్‌గివర్స్ హ్యాండ్‌బుక్‌’తో చికిత్స సులభతరం
Launch of Care Givers Handbook in Hyderabad for Medical treatment

· తెలంగాణ ప్రభుత్వ, సెర్ప్ సీఈఓ & ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారి శ్రీమతి దివ్య దేవరాజన్, హైదరాబాద్ యొక్క ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా రోగులకు Read more