kejriwal

ఆప్ వెనుకంజ!

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వెనుకబడింది. పార్టీ నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలంతా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ ఈసారి తడబడుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ లీడ్ లో కొనసాగుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం బరిలో నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత ఆతిశీ మార్లేనా కూడా వెనుకంజలోనే ఉన్నారు. జంగ్ పుర నుంచి పోటీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ లీడ్ లో కొనసాగుతున్నారు.

20250110122722 Arvind Kejriwal Delhi Election 2025

షాకూర్ బస్తీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరబ్ భరద్వాజ్ 500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు పైనే బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండగా.. ఆప్ అభ్యర్థులు 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త ముందుకొచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ వెనుకంజలో ఉన్నారు.

Related Posts
జమిని బిల్లు రాజ్యాంగ విరుద్ధం : ఎంపీ కనిమొళి
kanimozhi

‘ఒకే దేశం, ఒకే ఎన్నిక బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు లోక్‌సభలో ఖరాఖండిగా చెప్పామని డీఎంకే ఎంపీ కనిమొళి చెప్పారు. వన్‌ నేషన్‌, వన్‌ ఎలక్షన్‌ బిల్లు రాజ్యాంగ Read more

6 నెలల్లో అందుబాటులోకి బాలికల క్యాన్సర్‌ వ్యాక్సిన్‌
6 నెలల్లో అందుబాటులోకి బాలికల క్యాన్సర్‌ వ్యాక్సిన్‌

మహిళలను తీవ్ర ఇబ్బందికి గురిచేస్తున్న క్యాన్సర్ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా క్యాన్సర్‌లను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్‌ను ఐదు నుంచి ఆరు నెలల్లో అందుబాటులోకి Read more

సాయిపల్లవి ..వార్నింగ్
saipallavi post

తనపై వస్తున్న నిరాధార రూమర్స్ పై సాయిపల్లవి ఘాటుగా స్పందించారు. "నిరాధారమైన పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది" అని హెచ్చరించింది. బాలీవుడ్ లో రణ్ Read more

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రజాస్వామ్యంలో మీ రాజ్యం ఏంటి?: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు మరోసారి ఉచితాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత పథకాల వల్ల ప్రజలు పనికి ఒడిగట్టకుండా సోమరితనానికి లోనవుతున్నారని Read more