Arrest warrant issued against former Prime Minister of Bangladesh Sheikh Hasina

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అరెస్టు వారెంట్‌..

ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పై అరెస్టు వారెంట్ జారీ అయింది. ఆ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఈ వారెంట్ ఇచ్చింది. నవంబరు 18లోగా ఆమెను అరెస్టు చేసి తమ ఎదుట హాజరు పరచాలని ఐసీటీ చీఫ్‌ ప్రాసిక్యూటర్ మహమ్మద్‌ తజుల్‌ ఇస్లాం తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

రిజర్వేషన్లపై విద్యార్థుల నిరసనలు హింసాత్మకంగా మారడంతో.. ప్రధానిగా ఉన్న షేక్‌హసీనా పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. తర్వాత నుంచి ఆమె భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు. జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు జరిగిన మారణహోమం, ఇతర నేరాల ఆరోపణలపై హసీనాకు వ్యతిరేకంగా ఐసీటీకి 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై ట్రైబ్యునల్‌ ఇటీవల దర్యాప్తు ప్రారంభించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను బంగ్లాదేశ్‌కు రప్పిస్తామని, ఆమెపై అరెస్టు వారెంట్లు జారీ చేస్తామని ఐసీటీ నూతన ప్రాసిక్యూటర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమెను స్వదేశానికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే తాజా పరిణామం చోటుచేసుకుంది.

హసీనా పాలనపై తీవ్ర నిరసన వ్యక్తంచేసిన విద్యార్థి సంఘాలు ఆమె భారత్‌లో ఉండటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇదిలాఉంటే.. హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బీఎన్‌పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండు చేసిన సంగతి తెలిసిందే. మరోపక్క ఆమె దౌత్య పాస్‌పోర్టు రద్దయిన సంగతి తెలిసిందే. హసీనా హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను రద్దు చేసినట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు కొన్ని నిర్దిష్ట దేశాలు వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంటుంది. ఆగస్టు 5న పదవి నుంచి దిగిపోయి భారత్‌కు చేరుకున్న తర్వాత బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

ఇదిలా ఉంటే.. హసీనాను బంగ్లాకు రప్పించడానికి యూనస్‌ ప్రభుత్వం అన్ని యత్నాలు చేస్తందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ గతంలో పేర్కొంది. హసీనాను అప్పగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత భారత్‌పైనే ఉందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Related Posts
లేడీ అఘోరీ అరెస్ట్..
aghori arest

రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్దీ రోజులుగా లేడి అఘోరి హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యాచారాలు, గోహత్యల నివారణకే నేనున్నా అని అందుకోసం ఎన్నో పూజలు Read more

మహిళ హత్య కేసు..మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు 14 రోజుల రిమాండ్
14 days remand to former MP Nandigam Suresh in the case of murder of a woman

అమరావతి: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న నందిగం సురేశ్ ప్రస్తుతం వెలగపూడిలో Read more

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది Read more

లార్నూ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదుల హతం
Another encounter in Jammu and Kashmir 1

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుంది. ఆపరేషన్‌లో భాగంగా అనంతనాగ్‌ లోని లార్నూ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు శనివారం నాడు మట్టుబెట్టాయి. అనంతనాగ్ ఆర్మీ జవాన్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *