పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి

పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి

సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లి పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి పొందింది. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండేళ్లకు ఒకసారి జరిగే పెద్దగట్టు జాతరకు ఇప్పటికే సర్కార్ నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం నిధులు మంజూరు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

Peddagattu Jathara Durajpalli Photos 1

ప్రభుత్వ నిధులు మంజూరు:
రెండేళ్లకోసారి జరిగే పెద్దగట్టు జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 కోట్లు మంజూరు చేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డికు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రయాణ ఛార్జీలు:
ప్రత్యేక బస్సు సేవలు భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ 60 ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తెచ్చింది.
పెద్దలకు – రూ. 40, పిల్లలకు – రూ. 20 టీజీఎస్ఆర్టీసీ నల్లగొండ రీజినల్ మేనేజర్ కె. జానిరెడ్డి ప్రకారం, వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు హాజరవుతారు. భక్తుల సౌకర్యం కోసం సూర్యాపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తుల రాకపోకలకు విఘాతం కలగకుండా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. ఆలయం, ప్రధాన రహదారులు, బస ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

జాతర ఏర్పాట్లను పర్యవేక్షణ:
సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సహా అధికారులు ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశ్యుద్ద పనులు లైటింగ్ సివిల్ పనులు చేయించాం. జాతర ముగిసేవరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశ్యుద్ద సిబ్బంది, ప్రత్యేక అధికారులను అందుబాటులో ఉంచుతాం. అని మున్సిపల్ కమిషినర్ ఆదేశించారు జాతర ప్రాంతంలో 24/7 విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల కోసం వైద్య బృందాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

భక్తుల కోసం ప్రత్యేక సూచనలు:
భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలి. జాతర ఏర్పాట్లు పూర్తి కావడంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా యాత్రను కొనసాగించవచ్చు. ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ, వైద్య బృందాలు రంగంలోకి దిగాయి. భక్తులు పెద్దగట్టు జాతరకు విచ్చేసి లింగమంతుల స్వామి ఆశీస్సులు పొందాలని అధికారులు కోరారు. భక్తులు జాతరను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అధికారుల సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు.

Related Posts
‘దాకు మహరాజ్’ ఈవెంట్ ట్రాఫిక్ ఆంక్షలు
'దాకు మహరాజ్' ఈవెంట్ ట్రాఫిక్ ఆంక్షలు

శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు యూసుఫ్గూడ 1వ బెటాలియన్ గ్రౌండ్స్‌లో బాలకృష్ణ తాజా చిత్రం 'దాకు మహరాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ Read more

‘నారాయణ’ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య
narayana school hayathnagar

హైదరాబాద్‌లో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టించింది. హయత్నగర్ బ్రాంచ్‌లో ఏడో తరగతి చదువుతున్న లోహిత్ ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ ఘటన Read more

నకిలీ బిల్లులతో అమెజాన్ కు 100 కోట్ల మోసం
amazon

ఇందులో అని కాదు అందులో అని కాదు అన్ని రంగాల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా అమెజాన్ లో కూడా భారీ మోసం బయటపడింది. ప్రముఖ ఈ- కామర్స్ Read more

తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను చలిగాలులు పట్టి పీడిస్తున్నాయి. గురువారం రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల లాంటి పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు Read more