రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

పాకిస్థాన్‌లో రైలు హైజాక్ చేసిన మిలిటెంట్లను పాక్ సైనికులు అంతమొందించారు. బందీలుగా ఉన్న ప్రయాణికులను కాపాడారు. అయితే, ఈ ఘటనలో మొత్తం 21 మంది ప్రయాణికులతోపాటు నలుగురు పారామిలిటరీ సైనికులు మృతి చెందినట్లు పాక్ ఆర్మీ జనరల్ తెలిపారు. పాక్ భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని పాక్ ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ వెల్లడించారు. రైలులో ఉన్న అందరు మిలిటెంట్లను భద్రతా బలగాలు హతమార్చాయని.. ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని సదరు అధికారి తెలిపారు. దీంతో మిగిలిన ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

రైలు హైజాకర్లను అంతమొందించిన ఆర్మీ..బందీలకు విముక్తి!

రైలు హైజాక్ బీఎల్ఏ మిలిటెంట్ల పనే

కాగా, బలూచిస్థాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్‌కు వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) రైలును బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన సమయంలో 9 కోచ్‌లలో మొత్తం 440 మంది ప్యాసింజర్లు ఉన్నారు. రైలును హైజాక్ చేసింది తామేనని బీఎల్ఏ మిలిటెంట్లు ప్రకటించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పాక్ భద్రతా బలగాలు మిలిటెంట్లపై కాల్పులతో విరుచుకుపడ్డాయి. మిలిటెంట్లను అంతమొందించి రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు పాక్ ఆర్మీ అధికారులు ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం బీఎల్ఏ మిలిటెంట్లు రైల్వే ట్రాక్ పేల్చేసి రైలును హైజాక్ చేశారని చెప్పారు. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ కార్ప్స్, స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోస్ తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ మీడియాకు వెల్లడించారు. ఈ ఆపరేషన్ సమయంలో మిలిటెంట్లు ఆఫ్గాన్‌లోని తమ సహాయకులు, సూత్రధారులతో శాటిలైట్ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలసుకున్నారని చెప్పారు.

మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామని ఆర్మీ ప్రకటన
ప్రయాణికులను రక్షణ కవచాలుగా చేసుకోవడంతో ఈ ఆపరేషన్ ముగించేందుకు సమయం పట్టిందని లెఫ్టినెంట్ జనరల్ తెలిపారు. మంగళవారం సాయంత్రానికి 100 మంది ప్రయాణికులను, బుధవారం నాటికి మిగితా ప్రయాణకులను సురక్షితంగా కాపాడామని చెప్పారు. ఈ ఆపరేషన్ అత్యంత ఖచ్చిత్వంతోపాటు జాగ్రత్తగా చేయాల్సి వచ్చిందని వివరించారు. మొదట ఆత్మాహుతి బాంబర్లను స్నిపర్స్ చంపేశారని, ఆ తర్వాత ఒక్కో కంపార్ట్‌మెంట్‌లోని మిలిటెంట్లను హతమారుస్తూ వచ్చామని పాక్ జనరల్ వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. మిలిటెంట్లందరినీ మట్టుబెట్టామని చెప్పారు. ప్రయాణికులందరినీ కాపాడామని చెప్పారు. పాకిస్థానీయును లక్ష్యంగా చేసుకునే ఏ విదేశీ శక్తులను సాగనివ్వమని ఆయన చెప్పుకొచ్చారు.

Related Posts
హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. ఒకరికి తీవ్ర గాయాలు
Huge explosion at Hayat Nag

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఈరోజు ఉదయం ఘోర పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి స్టేషన్ ఆవరణలో Read more

నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం
Nitish Kumar Reddy received

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు Read more

Donald Trump :జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు
జో బైడన్ కు షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ సంతకాలు చెల్లవు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక తాజాగా మరో మారు ట్రంప్ తీసుకున్న Read more

జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం

జగన్ నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం జగన్‌నివాసం వద్ద భద్రత కట్టుదిట్టం. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం మరియు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి Read more