Argentina withdrawal from the World Health Organization

ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగిన అర్జెంటీనా

అర్జెంటీనా : ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలుగుతున్నట్లు అర్జెంటీనా తాజాగా ప్రకటించింది. అధ్యక్ష ప్రతినిధి మాన్యుయెల్‌ అడోర్నీ ఓ సమావేశంలో ప్రసంగిస్తూ.. ఈ మేరకు ప్రకటన చేశారు. అర్జెంటీనా ఏ అంతర్జాతీయ సంస్థను తన సార్వభౌమాధికారంలో జోక్యం చేసుకోవడానికి అనుమతించబోదని స్పష్టం చేశారు. డబ్లూహెచ్‌వో స్వతంత్రంగా పని చేయడం లేదని, దాని నిర్ణయాలు బాహ్య ఒత్తిడికి లోబడి ఉంటాయని ఆరోపించారు. మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన కొవిడ్ సమయంలో డబ్లూహెచ్‌వో సరిగా పని చేయలేదని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారిని కట్టడికిచేయడంలో విఫలం, ఇతర కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్జెంటీనా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.

image

కాగా, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్‌ ట్రంప్‌ సంచనల నిర్ణయం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నుంచి తప్పుకుంటున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. వాస్తవానికి ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా అవ‌స‌రం చాలా ఉంద‌ని, కానీ ఏం జ‌రుగుతుందో చూద్దామ‌ని ట్రంప్ అన్నారు. ఒక‌వేళ వీలైతే మళ్లీ డ‌బ్ల్యూహెచ్‌వోలో క‌లిసే అవ‌కాశాలు ఉన్నట్లు కూడా ఆయ‌న చెప్పారు. కొవిడ్‌-19ను నియంత్రించ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైంద‌ని, చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన ఆ వైర‌స్‌ను ప‌సిక‌ట్టడంలో ఆ సంస్థ విఫ‌ల‌మైంద‌ని, అవ‌స‌ర‌మైన సంస్కర‌ణ‌ల‌ను చేప‌ట్టలేక‌పోయింద‌ని, స‌భ్య దేశాల నుంచి రాజ‌కీయ ఐక‌మ‌త్యాన్ని తీసుకురావ‌డంలో అస‌మ‌ర్థంగా వ్యవ‌హ‌రించిన‌ట్లు ట్రంప్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జెనీవాకు చెందిన ఆ సంస్థ స‌భ్య‌త్వం నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు.

ఇక, ప్రపంచ ఆరోగ్య సంస్థ పనితీరుపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్‌-19 స‌మ‌యంలో డబ్ల్యూహెచ్‌వో స‌రైన రీతిలో వ్యవ‌హ‌రించ‌లేద‌న్న విమర్శలు ఉన్నాయి. చైనాలోని వుహాన్ నుంచి వ్యాపించిన ఆ వైర‌స్‌ను ప‌సిక‌ట్టడంలో ఆ సంస్థ విఫ‌ల‌మైంద‌ని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో నుంచి వైదొలుగుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ఇప్పటికే తన నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.

Related Posts
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్
చైనాతో ట్రంప్ మధ్యవర్తిత్వాన్ని తిరస్కరించిన భారత్

భారతదేశం, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ ప్రతిపాదనను స్పష్టంగా తిరస్కరించింది. Read more

ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య
man commits suicide by hang

ఏపీలోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కదులుతున్న ఆర్టీసీ బస్సులో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏర్పేడు సమీపంలోకి వచ్చినప్పుడు ఈ ఘటన జరగగా, Read more

మరికాసేపట్లో మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ ప్రసంగం..
Trumps speech to the supporters soon

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. ప్రస్తుతం పెన్సిల్వేనియాలో ట్రంప్‌ ఘన విజయం Read more

శ్వేత విప్లవ పితామహుడిని స్మరించుకుంటూ జాతీయ పాల దినోత్సవం..
verghese kurien

ప్రతి సంవత్సరం నవంబర్ 26 న భారతదేశంలో నేషనల్ మిల్క్ డేను సెలబ్రేట్ చేయడం, పాలు మరియు పాల పరిశ్రమకు చేసిన అద్భుత కృషిని గుర్తించడానికి ప్రత్యేకమైన Read more