జూన్ 24న ఏపీ క్యాబినెట్ తొలి సమావేశం

ఈ నెల 24వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు తొలి కెబినెట్ సమావేశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించనుంది. ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన ప్రారంభించిన నేపథ్యంలో, క్యాబినెట్ తొలిసారిగా సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై సీఎం చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు దిశానిర్దేశం చేయనున్నారు. హామీల అమలు, రాజధాని, పోలవరం నిర్మాణాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మొత్తం 8 శాఖలపై శ్వేతపత్రాల విడుదలకు ఈ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇప్పటికే ఏపీకున్న అప్పులపై కొత్త ప్రభుత్వం ప్రాథమిక సమాచారం తెప్పించుకుంది. రూ. 14 లక్షల కోట్లపైగా ఏపీకి అప్పుల భారం ఉందని ప్రభుత్వానికి సమాచారం వచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై విచారణ చేపట్టే అంశంపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.