ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

ఏపీలో అధికారం చేపట్టిన దగ్గరి నుండి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో ప్రకటించిన హామీలను నెరవేరుస్తూ ఉండగా..మరోపక్క రాష్ట్ర అభివృద్ధిని మొదలుపెట్టారు. రోడ్ల సమస్యలను తీరుస్తున్నారు..ఉచితంగా ఇసుక ఇస్తున్నారు..పెన్షన్ లు సైతం పెంచారు. ఇక సామాన్యులకు అందుబాటులో ఉండేవిధంగా నిత్యావసర ధరలను తగ్గిస్తున్నారు. ఇక ఇప్పుడు రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ అందించారు.

రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఉచిత బియ్యంతో పాటు సబ్సిడీపై చక్కెర, కందిపప్పును పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కిలో కందిపప్పును రూ.67కే ఇవ్వనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను పంపిణీ చేయనుంది. చక్కెర, పప్పు సరఫరా కోసం కాంట్రాక్టర్ల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఈ వారంలోనే ఈ-పొక్యూర్మెంట్ ద్వారా టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనుంది.