AP Inter results released

AP Inter Results : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

AP Inter Results : ఏపీ ఇంటర్ బోర్డు ఎగ్జామ్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గతేడాదికి భిన్నంగా ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా ఫలితాలు వెల్లడించారు. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకునేందుకు వీలుంది. విద్యార్థులు హాల్ టికెట్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి రిజల్ట్స్ పొందవచ్చు. ఏడాది వాట్సాప్ లోనే ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. వాట్సాప్ మనమిత్ర నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేసి ఫలితాలు పొందవచ్చు.

Advertisements
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీల్లో మంచి ఫలితాలు

ఈ సందర్భంగా నారా లోకేశ్‌ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని కొనియాడారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో ఏడాదిలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

నిర్ణీత గడువుకు ఇంటర్ ఫలితాలు విడుదల

ఈ ఏడాది 26 జిల్లాల్లో మొత్తం 1535 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులకుగానూ 10 లక్షల 17 వేల 102 మంది ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకూ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మార్చి 3 నుండి 20వ తేదీ వరకూ సెకండియర్ పరీక్షలు, మార్చి 1నుండి 19 వరకూ ఫస్టియర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. మూడు వారాల్లో ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని ఏపీ విద్యాశాఖ, ఇంటర్ బోర్డు కసరత్తు చేశాయి. నిర్ణీత గడువుకు ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు.

Read Also: ఏపీలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రేపు సెలవు రద్దు

Related Posts
భారత్-చైనా సరిహద్దు సమస్యలు: శాంతి కోసం విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యలు
S Jaishankar

2020లో లడఖ్‌లో జరిగిన సరిహద్దు ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఘర్షణల కారణంగా సరిహద్దులపై టెన్షన్స్ పెరిగాయి మరియు రెండు దేశాల మధ్య బలమైన Read more

తమ్ముడి కుమారులను పట్టుకొని ఓదార్చిన చంద్రబాబు
cbn ramurthi

సీఎం చంద్రబాబు సోదరుడు (తమ్ముడు), రామ్మూర్తి నాయుడు మరణించడంతో నారా కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అనారోగ్యం బారిన పడిన ఆయన గతకొంతకాలంగా హైదరాబాద్ Read more

క్రిమినల్ కేసులు లేవు.. రూ. 70 కోట్ల ఆస్తులున్నాయి.. నాగబాబు
క్రిమినల్ కేసులు లేవు రూ. 70 కోట్ల ఆస్తులున్నాయి నాగబాబు

క్రిమినల్ కేసులు లేవు.. రూ. 70 కోట్ల ఆస్తులున్నాయి.. నాగబాబు ఏపీలో కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన నాగబాబు తన నామినేషన్ దాఖలు సందర్భంగా Read more

రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి
Kishan Reddy comments on cm revanth reddy

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×