AP-Inter-Board-Remove-Inter-1st-Year-Exams

ఏపీ ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు తొలగింపు..

అమరావతి: ఏపీలో ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇంటర్ ఫస్టియర్ బోర్డ్ ఎగ్జామ్స్ ను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపడుతున్నాం. చాలా ఏళ్లుగా ఇంటర్ విద్యలో సంస్కరణలు జరగలేదు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని భావిస్తున్నాం.

image
image

జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి ఇంటర్ విద్యలో సంస్కరణలు చేపట్టాం. 2024-25 నుంచి పదోతరగతిలో ఎన్సీఈఆర్టీ టెక్ట్స్ బుక్స్ ప్రవేశపెట్టారు. విద్యావేత్తల నుంచి, ఇంటర్ విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి విలువైన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తున్నాం. సైన్స్, ఆర్ట్స్, ల్యాంగ్వేజ్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని కృతికా శుక్లా వెల్లడించారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే ఫస్టియర్ ఎగ్జామ్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తాజా నిర్ణయాలతో పాటు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ సైన్స్ సబ్జెక్టుల్లో NCERT సిలబస్‌ను ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఇది జాతీయ స్థాయిలో సమన్వయాన్ని పెంచుతుందని, విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధం కావడానికి ఉపకరిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం విద్యార్థుల ప్రగతిపై సానుకూల ప్రభావం చూపుతుందా లేదా అన్నది భవిష్యత్‌లో తెలుస్తుంది.

Related Posts
చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ
chinmaya krishna das

ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాక‌రించింది.న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను Read more

కేటీఆర్‌ పై ఏసీబీ కేసు నమోదు
KTR responded to ED notices

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కేటీఆర్ మీద ఏసీబీ Read more

ఇంద్రకీలాద్రిపై ప్రారంభమైన శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Sri Devi Sharan Navaratri celebrations started on Indrakiladri

Sri Devi Sharan Navaratri celebrations started on Indrakiladri విజయవాడ: కనకదుర్గమ్మ కొలువైన బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామునే జగన్మాతకు Read more

హైదరాబాద్ లో సస్టైనబల్ ఉన్నత విద్య కోసం యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్, సిమెన్స్, మరియు టి -హబ్ భాగస్వామ్యం
University of East London Siemens and T Hub partnership for sustainable higher education in Hyderabad

హైదరాబాద్ : యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ (యుఈఎల్), సిమెన్స్ యుకె మరియు టి -హబ్ హైదరాబాద్‌ సంయుక్తంగా 13 నవంబర్ 2024న సస్టైనబిలిటీ ని ముందుకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *