ప్రతిపక్ష నేత హోదా..జగన్‌ పిటిషన్‌పై స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

ap high court
ap high court

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మూడు వారాలు వాయిదా వేసింది. తమకు ప్రతిపక్ష నేత హోదాను ఇవ్వాలని ఇప్పటికే వైసీపీ… స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు జగన్ తరఫు న్యాయవాది ఈ రోజు విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

కక్షపూరితంగానే ప్రతిపక్ష హోదాను ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రతిపక్ష నేతగా స్పీకర్‌కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా? అని హైకోర్టు అడిగింది. గత నెల 24న ఇచ్చినట్లు జగన్ తరఫు న్యాయవాది సమాధానం ఇచ్చారు. దీంతో న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.