exams

ఏపీలో గ్రూప్​-1 మెయిన్స్‌ పరీక్షల తేదీలు విడుదల

ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు. ఏపీలో గ్రూప్​-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ప్రిలిమ్స్​లో 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించగా వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్​కి ఎంపిక చేసింది.

2023 డిసెంబర్​లో అప్పటి వైసీపీ ప్రభుత్వం 89 గ్రూప్​-1 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 మార్చి 17న ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌ను నిర్వహించింది. వైసీపీ సర్కార్ ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, మెయిన్స్ పరీక్ష రాసేందుకు తగిన గడువును ఇవ్వాలని కమిషన్‌ను పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి, అమలాపురంలో మెయిన్స్‌ పరీక్షల కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్​లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి కార్యదర్శి ఐ . నరసింహమూర్తి తెలిపారు. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లలో పొందుపరచి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Related Posts
నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu meets Union Ministers today

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు.అమరావతి: బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more

Drone Show: ఐదు ప్రపంచ రికార్డులతో చరిత్ర సృష్టించిన విజయవాడ డ్రోన్ షో
amaravathi

ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ సహకారంతో నిర్వహించిన ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన డ్రోన్ షో అద్భుతంగా విజయవంతమైంది ఈ భారీ ఈవెంట్ Read more

సంక్రాంతికి మరో 4 స్పెషల్ రైళ్లు
4 more special trains for Sankranti

సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక చర్యలు చేపట్టింది. రద్దీని తగ్గించడంలో భాగంగా మరో నాలుగు Read more

ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు పొడిగింపు
Application deadline extension for liquor shops in AP

అమరావతి: కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చిన ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం కొత్త‌ మ‌ద్యం దుకాణాల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, మ‌ద్యం షాపులు ద‌క్కించుకోవాల‌నుకునే Read more