AP govt

ప్రభుత్వ స్కూళ్లకు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ.1450 కోట్లతో స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లులు, క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూళ్ల కార్యదర్శి మస్తానయ్య ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా విద్యార్థులకు ఆధునిక వసతులు అందించడమే లక్ష్యమని ఆయన వివరించారు.

2026 నాటికి రాష్ట్రంలోని 855 స్కూళ్లలో ఈ ఆధునిక వసతులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు మస్తానయ్య తెలిపారు. దీని ద్వారా విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరగడంతో పాటు వారి ప్రగతికి తోడ్పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చిత్తూరు జిల్లా కలికిరి, పీలేరు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా మార్చాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు మస్తానయ్య వెల్లడించారు. ప్రస్తుతం గురుకులాల పరిధిలో 50 స్కూళ్లు, 10 జూనియర్ కాలేజీలు, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నాయని మస్తానయ్య వివరించారు. ఈ సంస్థలన్నింటిని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వ చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను పటిష్ఠంగా మార్చేందుకు తీసుకుంటున్న ఈ చర్యలను విద్యా వర్గాలు ప్రశంసిస్తున్నాయి.

Related Posts
రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్‌..
By election polling in Milkipur and Erode (East) constituencies in Tamil Nadu

న్యూఢిల్లీ: రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. 247 పోలింగ్‌ బూత్‌లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌‌, Read more

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు తెలిపిన సీతక్క
sithakka

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇలాంటి ఉద్యోగులకు జీతాలు Read more

4,000 స్టోర్లతో ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్
EV company Ola Electric with 4,000 stores

● సర్వీస్ సెంటర్లతో కలిసి 3,200+ కొత్త స్టోర్ల ప్రారంభం. ఇది ఒకేసారి భారతదేశపు అతిపెద్ద ఈవీ విస్తరణ..● మెట్రోలు, టైర్ 1 & 2 నగరాలను Read more

అభివృద్ధిపై కేసీఆర్ ప్రభుత్వంలో మాటలే.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కొండా సురేఖ
Minister Konda Surekha comments on kcr govt

వరంగల్‌: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఈరోజు వరంగల్ నగరంలో ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *