AP government handed over the investigation of actress Kadambari Jethwani case to CID

నటి కాదంబరీ జత్వానీ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం

అమరావతి: బాలీవుడ్ నటి కాదంబరీ జత్వాని కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీఐడీకి అప్పగించింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేశారు. జత్వానిపై అక్రమంగా కేసు నమోదు, అరెస్టు వ్యవహారంలో పలువురు సీనియర్ పోలీస్ ఉన్నతాధికారుల ప్రమేయం బయటపడడంతో దీని వెనుక సూత్రధారులను కనిపెట్టేందుకు లోతైన దర్యాప్తు అవసరమని ప్రభుత్వం భావించింది.

దీంతో ఈ కేసులకు సంబంధించి అన్ని రికార్డులను సీఐడీకి అప్పగించాలంటూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జత్వాని ఫిర్యాదు మేరకు నాటి పోలీస్ ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జత్వాని కేసులో ఇప్పటికే వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Related Posts
అమ్మో.. ధరలు బాబోయ్ ధరలు!
High prices

ప్రజల ఆదాయంలో ఎలాంటి మార్పులు కనిపించకపోయినా, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పు, ఉప్పు, కూరగాయలు, మాంసం వంటి అన్ని నిత్యావసరాలు కొండెక్కాయి. రాష్ట్రంలోని సాధారణ కుటుంబాలకు Read more

మాజీ మంత్రి రోజాకు షర్మిల కౌంటర్‌..
roja sharmila

ట్విట్టర్ వేదికగా ‘వైఎస్ షర్మిల .. మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లిష్ అర్థం కాదా? నిన్న మీ అన్న‌ రెండు భాషల్లో సెకీతో ఒప్పందం అంశానికి Read more

సీఎం చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ లేఖ
CPI Ramakrishna letter to CM Chandrababu

అమరావతి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఏపీ సీఎంకి లేఖ రాశారు. 2024-25లో ఏపీకి కేంద్రం నుంచి విడుదలైన నిధుల వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని Read more

Varun Chakravarthy :స్టార్‌ హీరో కోసం 3 కథలు సిద్ధం ఎవరు ఆ స్టార్ ,ఏమిటి ఆ కథ
Varun Chakravarthy :స్టార్‌ హీరో కోసం 3 కథలు సిద్ధం ఎవరు ఆ స్టార్ ,ఏమిటి ఆ కథ

క్రికెట్, సినిమా అనే రెండు ప్రధాన రంగాల్లో భారతదేశంలో ప్రజల మక్కువ అపారమైనది. క్రికెటర్లను, సినిమా హీరోలను అభిమానులు రోల్ మోడల్స్‌గా మరికొంత మంది వాళ్లను డెమీ Read more