AndhraPradesh :పింఛన్ దారులకు శుభవార్త చెప్పిన ఏపీప్రభుత్వం

AndhraPradesh :పింఛన్ దారులకు శుభవార్త చెప్పిన ఏపీప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నేళ్లుగా పెన్షన్ తీసుకునే సమయంలో వృద్ధులకు ఎదురవుతున్న ఓ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.ఆధార్ ప్రాధికార సంస్ధ ఉడాయ్ తాజాగా సాఫ్ట్ వేర్ మార్చడంతో అందుకు అనుగుణంగా లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో పెన్షన్ లబ్దిదారులకు దీర్ఘకాలంగా ఉన్న ఓ సమస్య తీరబోతోంది.

Advertisements

ఎన్టీఆర్ భరోసా

ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా కింద లక్షలాది మంది లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి. అయితే పెన్షన్ తీసుకునే సమయంలో లబ్దిదారులు తమ వేలిముద్రలను స్కానర్లపై స్కాన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వృద్ధాప్యం కారణంగా వేలిముద్రలు అరిగిపోవడం వల్ల అనేక మంది లబ్ధిదారులు తమ పెన్షన్ అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.గ్రామ, వార్డు సచివాలయాల్లో వాడుతున్న పాత ఫింగర్ ప్రింట్ స్కానర్లు సరిగ్గా పని చేయకపోవడం కూడా పెన్షన్ దారులకు అదనపు సమస్యగా మారింది. వేలిముద్రలు గుర్తించలేకపోవడంతో, పింఛన్ల పంపిణీ సక్రమంగా జరగలేదు. లబ్దిదారులు మళ్లీ మళ్లీ ప్రయత్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపుతోంది.

PENSION

కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లను పంపిణీ చేయనుంది. ఆధార్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావడంతో, పాత పరికరాలు పనిచేయడం లేదు. అందుకే ప్రభుత్వం ఉడాయ్ అప్‌డేట్‌కు అనుగుణంగా పనిచేసే కొత్త స్కానర్లు తీసుకురావాలని నిర్ణయించింది.ఈ కొత్త పరికరాలతో వృద్ధుల వేలిముద్రలు సులభంగా గుర్తించబడతాయి. ఫలితంగా పింఛన్లు పొందే వారి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి.

స్కానర్లు పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలకు మొత్తం 1,34,450 స్కానర్లను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. సచివాలయాల వారీగా ఆ పరికరాలను సిబ్బందికి అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఐదేళ్ల క్రితం కొనుగోలు చేసిన స్కానర్లు కావడంతో ఫింగర్ ప్రింట్ సరిగా పడక సిబ్బంది, లబ్దిదారులు ఇన్నాళ్లూ ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు నూతన పరికరాల సాయంతో ఈ సమస్యలకు చెక్ పెట్టబోతున్నారు.

తాజా నిర్ణయం

ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం పెన్షన్ లబ్దిదారులకు పెద్ద ఊరటను కలిగించనుంది. కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లతో పింఛన్లు తీసుకునే వృద్ధులు ఇకపై సమస్యలు ఎదుర్కొనే అవసరం ఉండదు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చినపెన్షన్ పంపిణీ మరింత సౌకర్యవంతం కానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది లబ్దిదారులకు అనుకూలమైన విధానం అమల్లోకి రానుంది.

Related Posts
TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు
TTD: చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి..టీటీడీ సిబ్బందిపై వేటు

తిరుమలలో మరోసారి భద్రతా విఫలమైందని తెలిపే ఘోర ఘటన చోటు చేసుకుంది. భక్తులు చెప్పులతోనే శ్రీవారి ఆలయ మహాద్వారం వరకు చేరుకోవడం, ఆలయంలోకి అడుగు పెట్టే స్థితికి Read more

R Gangadhara Rao: ఏపీలో భారీ మద్యం సీసాలు ధ్వంసం
R Gangadhara Rao: ఏపీలో భారీ మద్యం సీసాలు ధ్వంసం

మద్యం ఉత్పత్తి, రవాణాపై పోలీసుల కఠిన చర్యలు: కృష్ణా జిల్లాలో రూ. 28.97 లక్షల మద్యం ధ్వంసం కృష్ణా జిల్లాలో మద్యం అక్రమ రవాణా, నిల్వలపై పోలీసులు Read more

గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్
Center is good news for Gun

NDA తో టీడీపీ జత కట్టడం తో ఏపీకి వరుస గుడ్ న్యూస్ అందజేస్తుంది కేంద్రం. ముఖ్యంగా రాష్ట్రానికి నిధుల సమస్య అనేది లేకుండా అవుతుంది. రాజధాని Read more

Good Fry Day : గుడ్ ఫ్రై డే సందర్భంగా సీఎం చంద్రబాబు సందేశం
CM Chandrababu message on the occasion of Good Friday

Good Fry Day : గుడ్ ఫ్రై డే సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు సందేశం పంపారు. శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఆ దేవదూత Read more

Advertisements
×