ap state logo

మ‌రో ప‌థ‌కం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

ap state logo
ap state logo

అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పరిపాలనాపరమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. గత ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలను యథావిధిగా కొనసాగిస్తూనే పథకాల పేర్లను సర్కార్ మారుస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా జగన్ ప్రభుత్వం చిరు వ్యాపారుల కోసం తీసుకొచ్చిన ‘జగనన్న తోడు’ పథకం పేరును మార్చేసింది. ఈ మేరకు ‘చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు’గా పేరును మారుస్తూ సీఎస్ నీరబ్‌ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, పథకం పేరు మార్చాలంటూ గ్రామ సచివాలయాల నుంచి పెద్ద ఎత్తున విజ్క్షప్తులు రావడంతో పథకం పేరును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులు, హస్త కళాకారులు ప్రభుత్వం నుంచి రూ.10 వడ్డీ లేని రుణాన్ని పొందనున్నారు.

కాగా, గత వైఎస్‌ జ‌గ‌న్‌ ప్రభుత్వం చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారు, హస్త కళాకారుల కోసం ‘జగనన్న తోడు’ పథకం కింద రూ. 10వేల ఆర్థిక సాయం అందించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కరికి ఏటా వడ్డీలేని రూ.10 వేల రుణం అందించారు.

Related Posts
ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్
ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్

తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, వాటిని మూడు ఉప వర్గాలుగా విభజించాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Fatal road accident. Six killed

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తికి Read more

తెలంగాణ లో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది – బండి సంజయ్
మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వేలాది మంది యువత ఉద్యోగాల కోసం తమ జీవితాలను అర్పిస్తున్నప్పటికీ Read more

ఫిబ్రవరి 15 లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌..!
Panchayat election schedule before February 15.

హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఫిబ్రవరి 15 లోపే విడుదలయ్యే అవకాశం ఉన్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో పర్యటిచిన Read more