AP Deputy CM Pawan Kalyan speech in maharashtra

సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యం: పవన్ కళ్యాణ్

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహాయుతి కూటమి గెలుపు కోసం డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సనాతన ధర్మ పరిరక్షణే జనసేన లక్ష్యమని పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నడిచిన నేలపై తాము ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. దమ్కీలకు ఎట్టి పరిస్థితిలో కూడా భయపడేది లేదని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. దేశంలో ప్రతి హిందువు గుండెలో రామనామం లేకుండా ఉండదని అన్నారు.

కాగా, సినిమాల్లో పోరాటాలు చేయడం, గొడవ పెట్టడం చాలా ఈజీ అని.. నిజ జీవితంలో ధర్మం కోసం కొట్లాడటం, నిలబడటం చాలా కష్టమని తెలిపారు. హిందువులంతా ఏకమైతే.. హైదరాబాద్ నుంచి దేశాన్ని విచ్ఛినం చేసేందుకు వచ్చే వాళ్లు ఎంత అంటూ ఒవైసీ సోదరులను ఉద్దేశించి ఆయన హాట్ కామెంట్ చేశారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేలలో ఎలాంటి దమ్కీలకు భయపడేది లేదంటూ.. మజ్లిస్ పార్టీ నేతలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

అయితే తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా యోధుల పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి, శివాజీ మహరాజ్ పరిపాలనను, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు.

Related Posts
విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం
విశాఖలో లగ్జరీ క్రూయిజ్ షిప్ సిద్ధం

విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ షిప్ సేవలు పెరుగుతున్నాయి. తాజాగా, కార్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖపట్నం చేరుకునే సమయం ఖరారైంది. ఈ క్రూయిజ్ షిప్ సర్వీసుల గురించి విశాఖపట్నం Read more

Maruti Suzuki : వాహనాల ధరలను పెంచిన మారుతి సుజుకి
వాహనాల ధరలను పెంచిన మారుతి సుజుకి

సొంత కారు ఉండాలి అనేది చాల మంది కోరిక. అయితే మార్కెట్లో మధ్యతరగతి నుండి సంపన్నుల వరకు అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ధరలకు చాల కంపెనీల కార్లు. Read more

చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి రూ.300 కోట్లు విడుదల
Rs. 300 crore released for Chakali Ilamma University

హైదరాబాద్‌: తెలంగాణ వీరనారిగా పిలువబడే చాకలి ఐలమ్మ పేరిట గల కోఠిలోని మహిళా యూనివర్సిటీ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆ Read more

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ
నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ

నేడు ఫ్రాన్స్ పర్యటనకు మోదీ.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఫ్రాన్స్‌కు రెండు రోజుల అధికారిక పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో, ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో Read more