AP Cyclone Dana

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు

బంగాళాఖాతంలో ‘దానా’ తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర తుఫానుగా బలపడొచ్చని పేర్కొంది. ఒడిశా, బెంగాల్ వద్ద తీరం దాటొచ్చని భావిస్తోంది. దీని ప్రభావంతో విజయనగరం, మన్యం, శ్రీకాకుళం(D)ల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముంది. ఇటు రుతుపవనాల ప్రభావంతో రాయలసీమలో మరో 4 రోజులు భారీ వర్షాలు కురిసే ఛాన్సుంది.

ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 4 రోజుల పాటు పశ్చిమ బెంగాల్‌లో.. ఈనెల 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఒడిశాలోని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఈ దానా తుఫాన్ ఈనెల 24వ తేదీన ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ దానా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, ఏపీ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే సమయంలో మరింత భీకరమైన గాలులు, వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల నుంచి తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఈ దానా తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ దళాలు సిద్ధం అయ్యాయి.

Related Posts
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హౌస్ అరెస్టు
Former minister Kakani Govardhan Reddy house arrest

అమరావతి: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కూనుపూరు కాలువ పరిశీలనకు వెళ్తారన్న సమాచారంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేశారు. అయితే Read more

కామారెడ్డి జిల్లాలో మరో నేషనల్ హైవే ..?
Another National Highway in

కామారెడ్డి జిల్లాలో ప్రజలకు ప్రయోజనకరంగా నిలిచే మరో నేషనల్ హైవే ఏర్పాటు అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి స్టేట్ హైవేను జాతీయ రహదారిగా మార్చే Read more

రేపు సెలవు – తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Holiday tomorrow - Announcement by Telangana Govt

తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మరియు బ్యాంకులు Read more

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..ఆరుగురు మృతి
Fire accident in hospital..Six dead

దిండిగల్: తమిళనాడులోని దిండిగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. పొగతో ఊపిరి ఆడకపోవడం వల్లే వారు మరణించినట్టు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *