హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ – సీఎం చంద్రబాబు

నటుడు సోనూసూద్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులే కాదు రాజకీయ నేతలు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు బెస్ట్ విషెష్ అందిస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆయనకు ట్విటర్లో విషెస్ తెలిపారు. ‘మీరు లెక్కలేనంతమంది జీవితాల్ని మార్చేశారు. పేదలపై మీకున్న జాలి, దయ, ప్రేమ స్ఫూర్తిదాయకం. మీకు మరింత విజయం, సంతోషం చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నా’ అని పేర్కొన్నారు. మరోవైపు సోనూ పుట్టినరోజును కుప్పంలో పూరీ ఆర్ట్స్ పురుషోత్తం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. 1200మంది విద్యార్థులతో ఆయన చిత్రాన్ని రూపొందించారు.

తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించే సోనూసూద్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవసరం లేదు. తన నటనతో అభిమానులను సొంతం చేసుకున్న సోనూ.. తన సేవాగుణంతో అంతకు మించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో.. అందరూ భయపడి బతుకుతున్న సమయంలో నేనున్నా అంటూ బయటకు వచ్చి ఎంతో మందికి సాయం చేశారు. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో సేవాకార్యక్రమాలతో ప్రేక్షకుల చేత దేవుడు అని పిలిపించుకున్న నటుడు సోను. అలాంటి సోను పుట్టిన రోజు సందర్బంగా దేశ వ్యాప్తంగా అభిమానులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.