AP Cabinet meeting today

నేడు ఏపీ కేబినెట్ భేటీ

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సూపర్ సిక్స్ పథకాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

image
AP Cabinet meeting today

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏపీలో అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయలేదు. ఈ పథకం ఎప్పుడెప్పుడా అమలు చేస్తారా అని రాష్ట్రంలోని మహిళలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15, అక్టోబర్ 2న, నవంబర్ 1న ఉచిత బస్సు పథకం అమలు చేస్తారని భావించినా వారికి నిరాశే ఎదురైంది. సంక్రాంతికి సైతం పథకాన్ని పట్టాలెక్కించలేదు. మరోవైపు మంత్రుల బృందం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి మహిళలకు ఉచిత బస్సు పథకం తీరుతెన్నులను అధ్యయనం చేసింది. నేడు జరగనున్న కేబినెట్ భేటీలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 8న మహిళా దినోత్సవం నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని ప్రచారం మొదలైంది.

గీత కార్మికులకు 10 శాతం మద్యం షాపులు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. దీనిపై మంత్రివర్గం చర్చించి ప్రకటక చేసే ఛాన్స్ ఉంది. రైతు భరోసా సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలపై చర్చిస్తారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై తర్వాత ఎజెండా అంశంపై మంత్రులు చర్చించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్న తరుణంలో దీనిపై కీలకంగా చర్చ జరగనుంది. పలు ప్రాజెక్టుల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఆయా కంపెనీలకు కేటాయించిన భూములకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనపైనా చర్చిస్తారని సమాచారం. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించకపోవడంతో వాలంటీర్లు సీఎం చంద్రబాబును కలవనున్నారు. సీఎంను కలిసి వాలంటీర్లు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని, ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా వారిని కొసాగించడంతో పాటు వారికి రెట్టింపు జీతం ఇవ్వాలని సీఎం చంద్రబాబును వాలంటీర్లు కోరనున్నారు.

Related Posts
సజ్జల భార్గవరెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట
Sajjala Bharghav Reddy

వైసీపీ నేత సజ్జల భార్గవ రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ లపై సోషల్ మీడియాలో అనుచిత Read more

సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
సచిన్ టెండూల్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

సచిన్ టెండూల్కర్ తాజాగా CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకోనున్నారు. గత సంవత్సరం రవిశాస్త్రి మరియు ఫరోఖ్ ఇంజనీర్‌ల తర్వాత, ఈ శనివారం ఫిబ్రవరి 1న Read more

మళ్లీ లాక్డౌన్ రానుందా..? నిపుణుల హెచ్చరిక
hmpv china

చైనాలో మరోసారి కొత్త వైరస్ HMPV (హ్యూమన్ మెటాన్యుమో వైరస్) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్ కారణంగా శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతున్నాయని, ఈ కేసులు అక్కడి Read more

గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లు విడుదల

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ – 2 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన వెలువడింది. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *