AP Cabinet meeting concluded..Approval of many decisions

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..పలు నిర్ణయాలకు ఆమోదం

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం లభించింది. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇకపై 34 శాతం రిజర్వేషన్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కే అవకాశం ఉంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనందించేలా ఈ పాలసీలో మార్పులు చేశారు. పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నారు.

image

గతంలో పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు పనుల బిల్లుల చెల్లింపునకు ఆమోదం లభించినట్టు సమాచారం. ఇక, మద్యం ధరలపైనా, పోలవరం నిర్వాసితులకు కొత్త ఇళ్లు నిర్మించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్-2025కి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. అదే సమయంలో, సుమారు రూ.45 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో వెయ్యి గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్‌లో ఆమోదం లభించింది.

గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గాజువాకను ప్రత్యేకంగా తీసుకుని ఈ ప్రాంతంలో వెయ్యి గజాల వరకు కూడా సవరణ చేయలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్టసవరణకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రిమండలి ఆమోద ముద్ర పడింది. ఇక ఏపీ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్‌ 2025కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పోలవరం నిర్వాసితులకు సంబంధించి గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో రెండు సార్లు నగుదును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఓ వైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే.. మరోవైపు పోలవరం నిర్వాసితులకు రిహబిలిటేషన్ చేసే విధంగా కేబినెట్‌లో చర్చించారు.

Related Posts
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో : ప్రళయ్ క్షిపణి ఆకర్షణ
గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ప్రళయ్ క్షిపణి ఆకర్షణ

ఈ సంవత్సరం జనవరి 26న జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ భారత సైనిక శక్తి,సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటనుంది. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తి కావడాన్ని పురస్కరించుకొని,ప్రత్యేక Read more

 దేవరగట్టు బన్నీ ఉత్సవం .. కర్రల సమరంలో 100 మందికి గాయాలు
bunny fest

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో భారీ కర్రల సమరం: వంద మందికి పైగా గాయాలు కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో ఆదివారం వేకువజామున జరిగిన బన్నీ ఉత్సవం Read more

నేడు ఢిల్లీలో 101 మంది పంజాబీ రైతుల ర్యాలీ
101 Punjab farmers rally in Delhi today

న్యూఢిల్లీ: ఈరోజు మూడోసారి ఢిల్లీకి పంజాబీ రైతులు ర్యాలీ తీయ‌నున్నారు. శంభూ బోర్డ‌ర్ నుంచి 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ల‌నున్నారు. పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర Read more

కాకినాడ షిప్‌లో మరోసారి తనిఖీలు
Once again checks on Kakina

కాకినాడ : కాకినాడ పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుందన్న ఆరోపణలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక షిప్ ను స్వాధీనం Read more