AP Assembly budget meetings from 24th of this month

ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు..

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక, ఫిబ్రవరి 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో, సభకు పూర్తి స్థాయి సబ్జెక్టుతో సిద్ధమై రావాలని సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టం చేశారు.

image

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పద్దును ఫిబ్రవరి 28వ తేదీన సభ ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. అదే రోజు మండలిలో కూడా ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ బడ్దెట్ సమావేశాలు ఎన్నిరోజుల పాటు నిర్వహిస్తారనేది బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అయితే ఈ సమావేశాలను మూడు వారాల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టలేకపోయింది. అంతకు ముందు ఉన్న వైసీపీ సర్కారు ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపిస్తూ పూర్తి స్థాయి బడ్జెట్‌ పెట్టేలా పరిస్థితులు లేవని చెప్పుకొచ్చిన కూటమి సర్కార్‌.. ఓటాన్ అకౌంట్‌తోనే నెట్టుకొచ్చిన ప్రభుత్వం.. మరోసారి నవంబర్‌లో అదే ఫాలో అయిపోయింది.. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది నెలల తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది.

Related Posts
ఏపీకి కేంద్రం నిధులకు గ్రీన్ సిగ్నల్.
ఏపీకి కేంద్రం నిధులకు గ్రీన్ సిగ్నల్.

మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక మూలధన సాయం కింద రూ. 397 కోట్లు మంజూరు చేసింది. ఈ Read more

Chandra Babu: త్వరలో డీఎస్సీ నోటిఫికేష‌న్: చంద్ర‌బాబు
Chandra Babu: త్వరలో డీఎస్సీ నోటిఫికేష‌న్: చంద్ర‌బాబు

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు శుభవార్త అందించారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, నియామక Read more

ఫ్రీ బస్‌పై చిత్తశుద్ధి లేదు : వైఎస్‌ షర్మిల
sharmila

మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. టీడీపీ , జనసేన పార్టీలకు కాలయాపన తప్పా Read more

అందరికీ అందుబాటులో సీ ప్లేన్ ఛార్జీలు.. 3 నెలల్లో సేవలు ప్రారంభం : రామ్మోహన్‌ నాయుడు
Sea plane fares available to all. Services to start in 3 months. Rammohan Naidu

విజయవాడ: నేడు విజయవాడ - శ్రీశైలం మధ్య "సీ ప్లేన్" ను సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ వద్ద ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సీ Read more