హింసను ప్రేరేపిస్తున్న నేటి సినిమాలు

హింసను ప్రేరేపిస్తున్న నేటి సినిమాలు

ఒకప్పుడు సినిమాలు కుటుంబానికి అనువైన కథా కథనాలతో, మంచి సంగీతం, భావోద్వేగాలను పలికించే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేవి. ప్రేమ, బంధాలు, అనుబంధాలు, కుటుంబ గొడవలు, పెళ్లిళ్లు వంటి విషయాలు ప్రధాన అంశాలుగా ఉండేవి. కథలో వీటికి తగ్గట్టుగా హీరో, విలన్ మధ్య చిన్నపాటి ఘర్షణలు ఉండేవి. కానీ అవి సహజంగా, వాస్తవానికి దగ్గరగా ఉండేవి. అయితే, కాలానుగుణంగా సినిమా రూపం పూర్తిగా మారిపోయింది.ప్రస్తుతం యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, వంటి చిత్రాలు సినిమా రంగంలో హవాను చాటుతున్నాయి. కొత్తదనం కోసం వెతుకుతున్న దర్శకులు, వినూత్నమైన కథలు తెరపై ఆవిష్కరించాలనే తపనలో సాంకేతికతను ఆశ్రయించారు. దాంతో, సినిమాల్లో హింసాత్మక దృశ్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న చిన్న గొడవలు, మనస్పర్థలతో సరదాగా సాగిపోయే కుటుంబ కథా చిత్రాల స్థానాన్ని, రక్తపాతం, హత్యలు, పగ, ప్రతీకారం అనే అంశాలు నింపేశాయి.ఇప్పుడు యాక్షన్ సన్నివేశాలు అంటే గాయపడే సన్నివేశాలు మాత్రమే కాదు. ఆకర్షణీయమైన ఆయుధాలతో తలలు తెగిపడేలా, చేతులు, కాళ్లు ఎగిరిపడేలా గ్రాఫిక్స్ సహాయంతో చూపిస్తున్నారు. నరాలు తెగడం, మెడలు కోసేయడం, శరీరభాగాలు విడిపోవడం వంటివి స్పష్టంగా చూపించడం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. ఇదంతా ప్రేక్షకులకు థ్రిల్ల్ కలిగించాలనే ఉద్దేశ్యంతో జరుగుతున్నా, ఇది ఆరోగ్యకరమైన వినోదానికి పూర్తి విరుద్ధం.

20241227090704 marco

విలన్ ను మించిపోయేలా హీరో హింసను చూపించటం, దానికి రెట్టింపు పగ తీర్చుకునేలా హీరో నరమేధం సృష్టించటం, చివరికి రక్తపాతం మధ్య కథ ముగించటం.ఇది నేటి సినీ ట్రెండ్‌గా మారిపోయింది. పగ, హింస, రక్తపాతం లేకుండా సినిమాలు హిట్ కావనే పరిస్థితి దాదాపుగా లేదనిపించేలా ఉంది. పాటలు, భావోద్వేగ సన్నివేశాలు, కుటుంబ సంబంధాల మధురత వంటి అంశాలు,ప్రేమ పాటలు, విరహ గీతాలు, సహజమైన హాస్యం, మెలోడియస్ మ్యూజిక్ఇవన్నీ కనుమరుగయ్యాయి.

వెబ్ సిరీస్‌కూడాఇదేబాట

ప్రస్తుతం థియేటర్లతో పాటు ఓటీటీ వేదికలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. వెబ్ సిరీస్‌లు మరింత దారుణంగా హింసను ప్రదర్శిస్తున్నాయి. క్రైమ్, మాఫియా, డ్రగ్స్, గ్యాంగ్ వార్ వంటి కథాంశాలతో వస్తున్న వెబ్ సిరీస్‌ల్లో తిట్లు, బూతు సంభాషణలు, హింసాత్మక దృశ్యాలు, అసభ్యకర ప్రదర్శనలు ఎక్కువవుతున్నాయి. అవి కొంతమందికి ఆసక్తికరంగా అనిపించినా, ఎక్కువమంది ప్రేక్షకులకు మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నాయి.వినోదం అనగానే మానసిక ప్రశాంతతను కలిగించాల్సి ఉంది. కానీ, నేటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు మనలో దెబ్బతీసే హింసను, ఒత్తిడిని పెంచేలా తయారయ్యాయి. సాంకేతికంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా సినిమా ఎక్కడికో వెళ్లిపోయినా, భావోద్వేగాలు, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించడంలో వెనుకబడినట్టుగా అనిపిస్తోంది.

Related Posts
మరొసారి అల్లు అరవింద్ హెచ్చరిక
మరోసారి అల్లు అరవింద్ హెచ్చరిక

చందూ మొండేటి దర్శకత్వం వహించిన మూవీ 'తండేల్'. నాగచైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీ కి బన్నీవాసు నిర్మాత గా వ్యవహరించారు. మూవీ Read more

22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
22 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

ఇటీవల టాలీవుడ్‌లో ఓ పాత హీరోయిన్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. దాదాపు 22 ఏళ్ల క్రితం సినీ ఇండస్ట్రీలో తన తొలి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్న అన్షు అంబానీ Read more

నాగచైతన్యకు చెప్పాను వినలేదు మీ ఇష్టం అని చెప్పా నాగార్జున
naga chaitanya nagarjuna

టాలీవుడ్ ప్రముఖ కుటుంబం అక్కినేని ఇంట త్వరలో మరో పెళ్లి సందడి జరగబోతోంది. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, బాలీవుడ్ నటి మరియు తెలుగమ్మాయి శోభిత Read more

గ్లోబల్ స్టేజ్ పై అదరకొడుతున్న పుష్ప 2 పాటలు
గ్లోబల్ స్టేజ్ పై అదరకొడుతున్న పుష్ప 2 పాటలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై, అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు Read more