భారత్-అమెరికా సంబంధాలకు ముప్పు
భారత పారిశ్రామిక దిగ్గజం అదానీ గ్రూప్ (Adani Group) పై కొనసాగుతున్న లంచం కేసు కొత్త మలుపు తిరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలకవర్గంలోని న్యాయ శాఖ (DoJ) తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా మారాయని అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు సభ్యులు కొత్త అటార్నీ జనరల్‌కు లేఖ రాశారు. అదానీ గ్రూప్ పై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై బైడెన్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని వారు లేఖలో పేర్కొన్నారు. భారత్ మరియు అమెరికా మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలు అనేక ఏళ్లుగా బలంగా కొనసాగుతున్నాయి. కానీ ఈ కేసును అవసరమైన ఆధారాలు లేకుండానే ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఈ అనుబంధాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లు కాంగ్రెస్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

దింతో అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ తీసుకున్న చర్యలు సముచితమా? అనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఈ కేసును పక్కన పెట్టాల్సింది పోయి, మరింత ముందుకు తీసుకెళ్లడం ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీసేలా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా వ్యాపార రంగంపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇటీవల అదానీ గ్రూప్‌పై ఎలాంటి చట్టబద్ధమైన సాక్ష్యాలు లేకుండానే కేసును ముందుకు తీసుకెళ్లారని అనేక మంది నిపుణులు అంటున్నారు. ఈ కేసు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.