Another student committed suicide in Kota

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య..

బీహార్‌: ఉన్నత చదువులు, ఉద్యోగాల కోచింగ్‌కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్‌ కోటా లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. ఒత్తిడి కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి తనువు చాలించాడు. బీహార్‌ రాష్ట్రం వైశాలి జిల్లాకు చెందిన 16 ఏళ్ల విద్యార్థి ఐఐటీ-జేఈఈకి సన్నద్ధమవుతున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అతడు విజ్ఞాన్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గల ఓ హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటున్నాడు. అయితే, సదరు విద్యార్థి శుక్రవారం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఫ్యాన్‌కు యాంటీ హ్యాంగింగ్‌ డివైజ్‌ ఉన్నప్పటికీ అది పని చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, తాజా ఘటనతో కలిసి ఈ ఏడాది కోటాలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం ఇది 17వ ఘటన కావడం గమనార్హం. గతేడాది ఏకంగా 30 మంది దాకా విద్యార్థులు సూసైడ్‌ చేసుకున్నారు.

Advertisements

మరోవైపు, విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలతో అప్రమత్తమైన రాజస్థానం ప్రభుత్వం ఇటీవలే నివారణ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. ఇందులో భాగంగానే కోటాలోని అన్ని హాస్టళ్లు , పెయింగ్‌ గెస్ట్‌ వసతుల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్ల ను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్‌ కాయిల్‌ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్‌ అవ్వగానే సీలింగ్‌ నుంచి ఫ్యాన్‌ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్య ఘటనలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుతం యాంటీ హ్యాంగింగ్‌ డివైజ్‌ పనిచేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

Related Posts
ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాల అమలు
25 శాతం సుంకం విధించిన ట్రంప్.. భారతదేశంపై ప్రభావం ఎంత?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏప్రిల్ 2 నుండి భారతదేశం, చైనా సహా అనేక దేశాలపై పరస్పర సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. ఇతర దేశాలు అమెరికా ఎగుమతులపై Read more

Pomegranate : దానిమ్మ పండు ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టారు
pomegranate fruit

దానిమ్మ పండులో అనేక పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌ ఎ, సి, ఇ అధికంగా ఉంటాయి. ఈ పండును క్రమం తప్పకుండా తింటే Read more

హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం
హెచ్ 1బీ వీసా నిబంధనలు మరింత కఠినం

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో అన్ని రూల్స్ మారిపోతున్నాయి. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తున్న ట్రంప్ సర్కార్.. మరింత Read more

CM Chandrababu : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం
పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారం Read more

×