ప్రస్తుతం, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా టాప్ హిట్స్‌తో పాటు ఆకట్టుకునే గేమ్ షోలతో,టాక్ షోలతో ప్రేక్షకులను మజా పాడేస్తోంది. వెబ్‌సిరీస్‌లు, సినిమాలు,స్పెషల్ షోలు,గేమ్ షోలతో ఆహా ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్‌టైన్మెంట్ అందిస్తోంది.
ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా “కాఫీ విత్ ఏ కిల్లర్” ఆహా ఓటీటీలో నేటి నుండి స్ట్రీమింగ్ కావడానికి సిద్ధమైంది.ఈ సినిమా ఆర్ పి పట్నాయక్ దర్శకత్వంలో,ఆయన రాసిన కథతో తెరకెక్కింది.”సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్” బ్యానర్‌పై, సతీష్ నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం మిస్టరీ మరియు క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఉంటుంది.సినిమాలో టెంపర్ వంశీ, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, రవిబాబు, అంబటి శ్రీను, శ్రీరాప,జెమిని సురేష్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రం టెక్నికల్ టీమ్ అద్భుతంగా పనిచేసింది. అనుష్ గోరక్ ఈ చిత్రానికి డిఓపి,ఎడిటర్, డిఐగా పని చేశాడు, కాగా తిరుమల ఈ చిత్రానికి డైలాగులు రాశారు.ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భం పై, నటుడు అంబటి శ్రీను మాట్లాడుతూ, “ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి కాఫీ తాగే ఫీల్ కలిగిస్తుంది.ఆర్ పి పట్నాయక్ గారికి ఈ చిత్రంలో నాకు ఇచ్చిన పాత్ర కోసం నేను కృతజ్ఞతలు. ఆయన సంగీత దర్శకుడిగా, దర్శకుడిగా ఎంతో ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆయన అభిమానులు, యూత్ ఫుల్ లవ్ స్టోరీ కోసం ఈ సినిమా గురించి ఆశిస్తున్నారు. అలాగే ఈ చిత్ర నిర్మాత సతీష్ గారికి, గౌతం పట్నాయక్ గారికి నా కృతజ్ఞతలు.” అన్నారు.అంతే కాకుండా, నటి శ్రీరాప కూడా మాట్లాడుతూ, “మీడియా వారికి నమస్కారం. ఈ చిత్రం గురించి మాట్లాడటం అంటే, నేను మొదటగా గౌతమ్ గారిని గురించి చెప్పాలి. ఈ చిత్రం కోసం ఆయన చేసిన కృషి ఎంతో విలువైనది. ఆర్ పి పట్నాయక్ గారు ఎంతో ప్రతిష్టాత్మకమైన వ్యక్తి. ఆయన దర్శకత్వంలో పని చేయడం చాలా ఆనందకరమైన అనుభవం.” అన్నారు.