Another encounter..killed two Maoists

మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. ఎదురుకాల్పులు చోటుచేసుకున్న చోట ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు నిన్న ఛత్తీస్ గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్‌లో 12 మంది మావోయిస్టుల హతమయ్యారు. అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ భీకర కాల్పుల్లో పోలీసుల చేతిలో 12మంది మావోయిస్టులు మృతి చెందారు. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా చేపట్టిన సెర్స్ ఆపరేషన్‌లో ఏడుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాల ప్రకారం.. గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలకు, మావోయిస్టులకు కాల్పులు జరిగాయి.

ఛత్తీస్ గఢ్‌లోని నారాయణ్ పూర్, దంతెవాడ, జగదల్ పూర్, కొండగావ్ జిల్లాల భద్రతా బలగాలు బస్తర్ పరిధిలో ఉన్న అబూజ్ మడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా చేపట్టాయి. ఇందులో భాగంగా కూంబింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల దళాలపైకి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు చేశారు.

Related Posts
Amaravathi : ఏప్రిల్ 15 తర్వాత ‘అమరావతి’ పనులు స్టార్ట్
amaravathi 600 11 1470895158 25 1477377675 27 1493286590

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 తర్వాత నిర్మాణాలను పునఃప్రారంభించాలని నిర్ణయించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. రాజధాని అభివృద్ధిని Read more

ఎన్నారై భక్తులకు టీటీడీ ప్రత్యేక దర్శన అవకాశం!
తొక్కిసలాటపై సీబీఐ విచారణ కేసును కొట్టివేసిన హైకోర్టు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) స్థానిక మరియు ప్రవాస భారతీయ (NRI) భక్తులకు శుభవార్త ప్రకటించింది. ఫిబ్రవరి 11న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోరుకునే Read more

ఫస్ట్ డే 531 గ్రామాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ
rationcards

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన అర్హులైన కుటుంబాల్లో సంతోషం నింపింది. రాష్ట్ర వ్యాప్తంగా 531 గ్రామాల్లో ఈరోజు మొదటి రోజు 15,414 Read more

ప్రణబ్ ముఖర్జీ స్మారకానికి కేంద్రం అనుమతి
Centre approves Pranab Mukh

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారక నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ప్రకటించింది. ఈ నిర్ణయం పట్ల ప్రణబ్ కుమార్తె కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కుటుంబం స్మారక Read more