parnasala fellowship bhadra

పర్ణశాలలో శని, ఆదివారాల్లో అన్నదానం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాలలో శని, ఆదివారాల్లో అన్నదాన కార్య క్రమం నిర్వహించనున్నట్లు భద్రాచలం దేవ స్థానం ఈఓ రమాదేవి మంగళవారం తెలిపారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయంగా ఉన్న పర్ణశాలలకు వారాంతంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోందని, ఈ నేపథ్యంలో ఆలయంలో అన్నదానం చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

అలాగే భద్రాచలం రామాలయం సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారభించబోతుంది. ‘భద్రాద్రి దివ్యక్షేత్రం’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ రమాదేవి మంగళవారం వెల్లడించారు. ఇందులో భద్రాచలం ఆలయం ఉత్సవాల విశేషాలను, పూజలు సహా పూర్తి సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయనున్నట్టు ఆమె పేర్కొన్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులకు ఇక్కడి రోజువారీ క్రతువుల గురించి వివరించే వెసులుబాటు లభించింది. ఇప్పటికే ఈ ఛానెల్ ట్రయల్‌ రన్‌ పూర్తయినట్టు అధికారులు తెలిపారు.

Related Posts
దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
jayachandran singer dies

ప్రఖ్యాత గాయకుడు పి జయచంద్రన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 80 సంవత్సరాల వయసులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన Read more

ఈ నెల 17న మంగళగిరి ఎయిమ్స్ కు రాష్ట్రపతి
President to Mangalagiri AI

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎయిమ్స్‌ ప్రథమ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. స్నాతకోత్సవ కార్యక్రమంలో Read more

వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై హైడ్రాకు ఫిర్యాదు
Hydra Commissioner AV Ranganath

హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగరవాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధభవన్‌లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు Read more

ప్రజలు మోసపు మాటలను నమ్మి చంద్రబాబుకు ఓట్లు వేశారు – జగన్
jagan babu

అబద్ధాలు ప్రచారం చేసి కూటమి ఎన్నికల్లో గెలిచిందని, ప్రజలు మోసపు మాటలను నమ్మి ఓట్లు వేశారని, రాష్ట్రాన్ని కూటమి నిండా ముంచేసిందన్నారు మాజీ సీఎం , వైసీపీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *