ఏపీలో ‘అన్న క్యాంటీన్లు’ ప్రారంభం

Food menu for a week in Anna canteen..

ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మరికాసేపట్లో గుడివాడలో CM చంద్రబాబు తొలి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. మిగతా 99 క్యాంటీన్లను రేపు మంత్రులు, MLAలు, MPలు ఓపెన్ చేస్తారు. వీటి ద్వారా రోజుకు సుమారు 1.05 లక్షల మందికి ఆహారం అందిస్తారు. ఈ క్యాంటీన్లలో రూ.5కే భోజనం అందిస్తారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తారు. ఉ.7.30 గంటల నుంచి రాత్రి 9 వరకు తెరిచే ఉంటాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ లను తీసుకొచ్చినా.. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ వీటిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే మళ్లీ అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు..అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై సంతకం చేశారు. స్వాతంత్ర్యం దినోత్సవం రోజునే పున:ప్రారంభం జరుగుతుంది.