కూకట్‌పల్లిలో 120 పడకల, మహిళ మరియు శిశు సంరక్షణ ఆసుపత్రిని ప్రారంభించిన అంకుర హాస్పిటల్

అందరికీ ప్రపంచ స్థాయి గైనకాలజీ మరియు పీడియాట్రిక్ కేర్ అందించడానికి కట్టుబడి ఉంది..

Ankura Hospital opens 120-bed women and child care hospital at Kukatpally

హైదరాబాద్: మహిళ మరియు శిశు సంరక్షణ ఆసుపత్రుల యొక్క ప్రముఖ మరియు విశ్వసనీయ చైన్ అంకుర హాస్పిటల్, హైదరాబాద్లోని కూకట్పల్లిలో తమ నూతన 120 పడకల హాస్పిటల్ ను ప్రారంభించింది. భారతదేశ వ్యాప్తంగా కార్యకలాపాల నిర్వహణతో అంకుర మరియు 9M బై అంకుర తో, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మరియు ఒడిశాలో 14 ప్రపంచ స్థాయి కేంద్రాలను కలిగి ఉంది. లక్షలాది మంది విశ్వసించే అంకుర, ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా సన్నద్ధమైన, డిజిటలైజ్డ్ సెంటర్గా అభివృద్ధి చెందింది. అన్ని వయసుల మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన పూర్తి ఆరోగ్య సంరక్షణ అవసరాలకు తగినట్లుగా సమగ్ర సంరక్షణను అందిస్తుంది. కొత్తగా ప్రారంభించబడిన హాస్పిటల్ ఆకట్టుకునే రరీతిలో 50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది, అసాధారణమైన వైద్య సేవలను అందించడానికి కట్టుబడి ఉన్న అంకుర తమ నిబద్ధతను కొనసాగిస్తుంది.

2011లో ప్రారంభమైనప్పటి నుండి, KPHBలోని అంకుర హాస్పిటల్, మహిళలు మరియు పిల్లలకు అధిక- నాణ్యత ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తోంది. లెవెల్ III NICU మరియు PICU, ఆధునిక మరియు సౌకర్యవంతమైన బర్తింగ్ సూట్లు మరియు 24 గంటలూ అత్యవసర సంరక్షణ తో సహా సరికొత్త సాంకేతికతను హాస్పిటల్ కలిగి వుంది. అదనంగా, ఇది ప్రత్యేకమైన అంబులెన్స్ సేవ మరియు నిపుణులైన శిశువైద్యులు, ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్ట్లు మరియు మహిళలు పిల్లల కోసం పీడియాట్రిక్ రుమటాలజీ, ఇమ్యునాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, హెమటాలజీ, ఆర్థోపెడిక్స్ మరియు ఎండోక్రినాలజీ వంటి అరుదైన స్పెషాలిటీస్ కవర్ చేసే వివిధ సూపర్ స్పెషలిస్ట్ల బృందాన్ని సైతం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా NICU, పీడియాట్రిక్ సర్జరీ మరియు పీడియాట్రిక్ యూరాలజీలో అధిక విజయాలను సాధించటం ద్వారా అంకుర గుర్తింపు పొందింది.