📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

TTD Vigilance : టిటిడిలో అటకెక్కిన విజిలెన్స్ అధికారుల దర్యాప్తు

Author Icon By Shravan
Updated: August 20, 2025 • 11:55 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి TTD vigilance : ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానమ్ (Tirumala Tirupati Devasthanams) గత ఐదేళ్ళలో వైసిపి ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. ఈ విచారణ ఎంతవరకు సాగిందనేది అంతా గప్చుప్ మారింది. ఆరునెలల క్రిందట రెండు దఫాలుగా టిటిడిలో పలు విభాగాలపై సోదాలు చేసిన విజిలెన్స్ అధికారులకు కీలక అంశాలు వెలుగు చూడటంతో ప్రకంపనలు మొదలయ్యాయి. భక్తులు తమ మొక్కుబడుల రూపంలో దేవుని హుండీకి సమర్పించుకుంటున్న నగలు, నగదు కానుకలతో భక్తుల సంక్షేమానికి సౌకర్యాలకు వెచ్చించాల్సిన నిధులను పక్కదారి పట్టించి భారీగా ముడుపులు దండుకున్నారనే ఆరోప ణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ తనిఖీలు చేపట్టింది. అప్పటికే శ్రీవాణి ట్రస్ట్ విరాళాలు, బ్రేక్ దర్శనాలు, పలు రకాల ఇంజనీరింగ్ పనులు, కీలక టెండర్లు, ప్రముఖుల సిఫార్సు లేఖలపై తిరుమలేశుని విఐపి బ్రేక్ దర్శనాలు, ఆర్జితసేవలకేటాయింపు వంటి అంశాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వ విజిలెన్స్ అధికారులు కొన్ని కీలక రికార్డులు, ఆధారాలను కూడా సేకరించారనేది కీలక సమాచారం. ఇదే అంశంపై తిరుపతికి చెందిన బిజెపి నాయకుడు పి. నవీన్ కుమార్ రెడ్డి విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ సీనియర్ ఎస్పీ కరీముల్లాషరీఫ్గన్ను కలసి ఆధారాలతో ఫిర్యాదు కూడా చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. చేశారు. ఇప్పుడు ఈ అంశం పూర్తిగా పక్కదారిపట్టిందనేది టిటిడి వర్గాల్లో చర్చమొదలైంది. నవీన్ అందించిన సమాచారంతో టిటిడిలో ఇంజనీరింగ్ పనులకు టెండర్లు ఆమోదం, నిధులు విడుదల, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు, విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించిన అక్రమాలపై ఆధారాలతో నివేదిక సమర్పించడం విజిలెన్స్కు మరింత మార్గం సుగమమైందని అప్పట్లో హాట్ టాఫిక్ మారింది.

తిరుమల టిటిడిలో అవినీతి ఆరోపణలు – విజిలెన్స్ దర్యాప్తుతో కలకలం

అప్పుడే తిరుమలలోని అదనపు ఇఒ కార్యాలయంలో విధులు నిర్వహించిన ఇద్దరు కీలక అధికారులను విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు పలు ప్రశ్నలు సంధించి ఆధారాలు సేకరించారు. ఈ ఆధారాలతో దర్శనాల అక్రమాలపై కీలక అధికారిపై కేసు నమోదు చేసే అవకాశం ఉందని చర్చజరిగింది. 14 అంశాలకు సంబంధించి టిటిడిలో (TTD) అవినీతి అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కూపీ లాగింది. విజిలెన్స్ అధికారులు తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో అన్నప్రసాదం, ఇంజనీరింగ్ విభాగం, సేవాటిక్కెట్ల అక్రమాలు, నిధులు ప్రైవేటు బ్యాంకులకు మళ్ళింపు, లడ్డూ తయారీకి వినియోగించే ముడిసరుకుల కొనుగోళ్ళలో అక్రమాలు, నాణ్యతా ప్రమాణాలు వంటివాటికి సంబంధించి సేకరించిన ఆధారాలతో సాక్ష్యాలను సేకరించారనేది అప్పట్లో వినిపించిన వార్తలు. మరీ ఈ దర్యాప్తు నివేదికలు ప్రభుత్వానికి చేరితే ఇంతకాలం ఎందుకు గప్ చుప్ గా ఉన్నారనేది టిటిడిలో ఇప్పుడు పెద్ద చర్చమొదలైంది.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/amaravati-minister-narayana-furious-over-ysrcp/andhra-pradesh/532994/

Breaking News in Telugu Latest News in Telugu Telugu News Paper Tirupati temple vigilance TTD corruption cases TTD scams and probes TTD vigilance investigation TTD vigilance officers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.