నేటి నుంచి ప్రక్రియ మొదలు
విజయవాడ : ఏపీ లాసెట్, పీజీసెట్, ఎడ్సెట్, పీఈసెట్, కింద ప్రవే శాలకు సంబంధించిన కౌన్సిలింగ్ లకు ఉన్నత విద్యా మండలి షెడ్యూలు విడుదల చేసింది. వీటికి రెండు విడతల కౌన్సిలింగ్లు నిర్వ హించనున్నట్లు పేర్కొంది. న్యాయ విద్యకు సంబంధించిన ఏపీ లాసెట్, పీజీ లాసెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ (LAWCET Admissions Counseling) ఈ నెల 8 నుంచి ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి టీవీ కృష్ణమూర్తి శనివారం తెలిపారు. రిజిస్ట్రేషన్కు ఈ నెల 8-11 వరకు, ధృవపత్రాల పరిశీలనకు 9-12 వరకు, వెబ్ ఐచ్చికాల నమోదుకు 12-14 వరకు, ఐచ్చికాల మార్పునకు 15న అవకాశం కల్పించినట్లు చెప్పారు.

కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఇచ్చినట్లు
17న సీట్ల కేటాయింపు, 19న కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. బీఇడీలలో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్సెట్ కౌన్సిలింగ్ (Edset Counseling) ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల9-12 వరకు, ధృవ పత్రాల పరిశీనకు 10-13వరకు, వెబ్ ఐచ్చికాల నమోదుకు కాల మార్పునకు 16న అవకాశం కల్పించారు.
18న సీట్ల కేటాయింపు, 19, 20 తేదీల్లో కళాశాలల్లో చేరేందుకు అవకాశం ఇచ్చారు. వ్యాయామ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన పీఈసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 10 నుంచి జరుగనుంది. రిజిస్ట్రేషన్కు ఈ నెల 10-13వరకు, ధృవపత్రాల వరకు, వెబ్ ఐచ్చికాల నమోదుకు 14-16 వరకు, ఐచ్చికాల మార్పుకు 17న అవకాశం ఇచ్చారు. 19న సీట్ల కేటాయింపు 22,23 తేదీల్లో కళాశాలల్లో చేరేందుకు అవకాశం కల్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: