అమెరికాలో మరో తెలుగు యువతి మృతి

ఉన్నంత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు పలు కారణాలతో మృత్యువాత పడుతూ..వారి కుటుంబంలో విషాదం నింపుతున్నారు. తాజాగా గుంటూరు కు చెందిన విద్యార్థిని రోడ్డు ప్రమాదం లో కన్నుమూసింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఓక్ల హామాలో ఎంఎస్ చేస్తున్న హారిక(24) అనే యువతి.. నిన్న వర్సిటీ నుంచి స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆమె ప్రయాణిస్తున్న కారు ముందు ఓ బైకర్ కిందపడటంతో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో వెనకాల నుంచి వచ్చిన 3 కార్లు హారిక వాహనాన్ని బలంగా ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఆమె మరణించగా.. మిగతావారికి గాయాలయ్యాయి.

హారిక తండ్రి దేవాదాయ శాఖ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు జెట్టి శ్రీనివాసరావు, నాగమణి. హారిక ఏడాదిన్నర క్రితం వెటర్నరీలో ఉన్నత చదువులు కోసం అమెరికా వెళ్ళింది. ఆదివారం ఉదయం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు. ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తెచ్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తరలించేందుకు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలోని ఎన్‌ఆర్‌ఐలతో సంప్రదిస్తున్నారు.