anchor syamala

Anchor Shyamala: చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణలపై యాంకర్ శ్యామల విమర్శలు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి మరియు బుల్లితెర యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా కూటమి పాలనలో బాలికలు మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె మండిపడ్డారు తాడేపల్లిలో మీడియా వేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ ఆరోపణలను వెలువరించారు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై దాడులు అఘాయిత్యాలు జరుగుతున్నాయని శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు పిఠాపురంలో ఒక మహిళపై జరిగిన అత్యాచార ఘటనలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు దూపురంలో అత్తా-కోడళ్లపై గ్యాంగ్ రేప్ ఘటన జరిగితే బాలకృష్ణ ఎందుకు స్పందించలేదని అతను ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీశారు.

శ్యామల ఒక మహిళగా ఒక తల్లిగా హోం మంత్రి అనిత కూడా ఈ విషయంలో సరైన విధంగా స్పందించడం లేదని విమర్శించారు ఎన్నో దారుణాలు జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఘటనలు గురించి బాధ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు తమ ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం దిశ యాప్ తీసుకువచ్చి దాని ద్వారా ఎంతో మంది మహిళలకు న్యాయం జరిగిందని శ్యామల గుర్తు చేశారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ యాప్ ను పక్కన పెట్టారని జగన్ కు మంచి పేరు వస్తుందని భయపడి దానిపై బురద చల్లారని ఆరోపించారు అంతేకాకుండా రాష్ట్రంలో కాల్ మనీ సెక్స్ రాకెట్ మళ్లీ బయల్పడుతోందని గతంలో ఈ రాకెట్‌కు సంబంధించి తీసుకున్న చర్యలను వదిలిపెట్టి మళ్లీ అదే పరిస్థితులు నెలకొంటున్నాయని శ్యామల అన్నారు మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.

Related Posts
ఎన్టీఆర్ సినిమాలో ఉన్న ఈ అమ్మడిని ఇప్పుడు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే
Payal Ghosh

జూనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో "ఊసరవెల్లి" ఒకటి. స్టైలిష్ మేకింగ్‌కి ప్రసిద్ధి చెందిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఎన్టీఆర్ అభిమానులతో Read more

సుకుమార్ నాలో ఉన్న కళని నమ్మారు.. అనసూయ
సుకుమార్ నాలో ఉన్న కళని నమ్మారు.. అనసూయ

ప్రముఖ దర్శకుడు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా యాంకర్ అనసూయ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఆమె తన అనుబంధాన్ని మరియు కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, సుకుమార్ తన Read more

బిల్లాలో నా డ్రసింగ్ చూసి మా అమ్మ చెప్పిన మాట విని షాక్ అయ్యా..
anushka shetty

తెలుగు సినీ ఇండస్ట్రీలో అనుష్క శెట్టి అనేది ఓ ప్రత్యేక పేరు. బాహుబలి సినిమా తరువాత ఆమె సినిమాల సంఖ్య కొంత తగ్గింది. కానీ ఇప్పుడు, ఆమె Read more

మలయాళ మూవీ రికార్డ్
rekhachithram

మలయాళంలో వేణు కున్నప్పిలి నిర్మించిన ఈ సినిమాకి, జోఫిన్ చాకో దర్శకత్వం వహించాడు. మర్డర్ మిస్టరీ తో కూడిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది.క్రితం ఏడాది ఆరంభం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *