అట్టహాసంగా అనంత్‌ అంబానీ వివాహం

ప్రపంచ కుబేరుడు ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అట్టహాసంగా జరిగింది. దేశ విదేశాల నుంచి ఎందరో అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై దీవెనలు అందించారు.

శుక్రవారం రాత్రి జియో వరల్డ్‌ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో అనంత్‌ అంబానీ.. ఫార్మా దిగ్గజం వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధికా మర్చంట్‌ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు రాజకీయ రంగానికి చెందిన పలువురితో పాటు క్రికెటర్లు, బాలీవుడ్‌ అగ్ర తారాగణం, అంతర్జాతీయ వ్యాపార, క్రీడా, కళారంగాల ప్రముఖులు వివాహానికి హాజరయ్యారు.