GHMC పరిధిలో ఆమ్రపాలి తనిఖీలు

జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ ఆఫీసర్ కాటా ఆమ్రపాలి పాలనలో తనదైన శైలీలో దూకుడు పెంచారు. జీన్స్, టీషర్ట్‌తో ఆమ్రపాలి.. సాధారణ అమ్మాయిలా హైదరాబాద్‌ రోడ్లపై తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నగరంలో పారిశుధ్యం, శానిటేషన్ పనుల తీరుపై ఫోకస్ పెట్టారు ఆమ్రపాలి. ఇందులో భాగంగానే బుధవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి కాట నగరంలో పలు ప్రాంతాల్లో శానిటేషన్ పరిశీలన చేయుటకు బుధవారం ఆకస్మికంగా పర్యటించారు.

అనంతరం పారిశుద్ధ్యంపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించారు. సిబ్బంది పని తీరు ఎలా ఉందని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆమె సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.