తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఆమ్రపాలి

Amrapali approached Telangana High Court

హైరదాబాద్‌: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్యాట్ తీర్పును ఆమె ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. ఆమెతో పాటు రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ లు కోర్టులో పిటిషన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ ను హైకోర్టు స్వీకరించింది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జస్టిస్ అభినందన్ కుమార్ శావలే బెంచ్ ఈ పిటిషన్ పై విచారించనుంది.

తమకు కేటాయించిన రాష్ట్రాల్లో అక్టోబర్ 16న రిపోర్ట్ చేయాలని ఈ నెల 9న డీఓపీటీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను క్యాట్ లో సవాల్ చేశారు ఐఎఎస్ అధికారులు. అయితే డీఓపీటీ ఆదేశాలను పాటించాలని క్యాట్ అక్టోబర్ 15న ఆదేశించింది. ఈ ఆదేశాలను ఐఎఎస్ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. The technical storage or access that is used exclusively for statistical purposes. Latest sport news.