Amit Shah is not eligible to enter Andhra.. Sharmila

అమిత్‌షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హత లేదు : షర్మిల

అమరావతి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో భారతరత్న బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాకు ఆంధ్రలో అడుగుపెట్టే అర్హతలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమిత్ షా టూర్‌ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అమిత్ షా ఏపీ పర్యటన సందర్భంగా రాష్ట్రంలోని అంబేద్కర్ విగ్రహాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలపాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, కేడర్‌కు పిలుపునిస్తున్నట్లు షర్మిల ఎక్స్ వేదికగా షర్మిల రాసుకొచ్చారు.

image
Amit Shah is not eligible to enter Andhra: Sharmila

అంబేద్కర్‌పై చేసిన అనుచతి వ్యాఖ్యల పట్ల అమిత్ షా దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలెఉ చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించడమంటే దేశ ద్రోహంతో సమానమని.. నిండు సభలో అంబేద్కర్‌ను హేళన చేస్తూ మాట్లాడిన అమిత్ షా దేశ ద్రోహి అని షర్మిల ఆరోపించారు. దేశ ద్రోహుల వ్యాఖ్యలను ఖండించకుండా, అమిత్ షాను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయకుండా ఆయనకు అతిథి మర్యాదలు చేసే వాళ్లుఎ కూడా ఈ దేశానికి ద్రోహం చేసినట్టేనన్నారు షర్మిల.

అమిత్ షాతో వేదిక పంచుకొనే పార్టీలు, మౌనంగా ఉండే పార్టీలు దేశానికి ద్రోహం చేస్తున్న పార్టీలేనని ఆమె విమర్శించారు. రాష్ట్రంలోని దళిత, బహుజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజల మీద గౌరవం ఉంటే కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ కేంద్రహోంమంత్రి అమిత్ షాతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని.. కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందని షర్మిల రాసుకొచ్చారు.

Related Posts
2 లక్షల ఉద్యోగాలు కాదు..ఉన్నవి తీసేస్తున్నారు..కేటీఆర్‌ ఆగ్రహం
KTR tweet on the news of the arrest

హైదరాబాద్‌: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పాపపు పాలనలో ప్రతి బిడ్డా నిరాశలో ఉన్నారని ఆరోపించారు. 165 ఏఈఓలు, Read more

మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?
medical shops

ఈరోజుల్లో మనిషి బ్రతుకుతున్నాడంటే అది టాబ్లెట్స్ వల్లే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకునేవారు..టాబ్లెట్స్ అనేవి పెద్దగా వాడే వారు కాదు..మరి ఎక్కువైతే ఆయుర్వేదం Read more

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
tirumala devotees

తిరుమలలో భక్తుల రద్దీ ప్రతిఏడు సీజనల్ సమయానికి సాధారణంగా ఉండే విషయం. ప్రస్తుతం, స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడడం Read more

పాపికొండల పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది
water in the papikondala to

పాపికొండల పర్యాటకులకు పెను ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. పాపికొండలు నదీ విహారయాత్ర చాల రోజుల తర్వాత ప్రారంభమైంది. నాలుగు నెలల తర్వాత పర్యాటకులకు అనుమతి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *