కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ఏపీకి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్ళి, సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. తరువాత విజయవాడలోని ఓ హోటల్లో బస చేయనున్నారు. అక్కడే ఆయన స్థానిక నేతలతో ఇతర కీలక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. రేపు అమిత్ షా గన్నవరం సమీపంలోని NIDM (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసాస్టర్ మేనేజ్‌మెంట్) సెంటర్ ప్రారంభించనున్నారు.
ఈ కేంద్రం, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణకు సహకారం అందించడానికి కీలకమైనది. అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాన్ని కూడా ప్రారంభిస్తారు. ఈ బెటాలియన్ విపత్తుల సమయంలో సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాటైనది. అలాగే అమిత్ షా డిప్యూటీ సీఎం పవన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై చర్చ జరుగుతుందని అంచనా వేస్తున్నారు.